సెకండ్ వేవ్ తో టోటల్ కన్ఫ్యూజన్ లో మెగా ఫ్యామిలీ !
గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ సమస్యల నుండి ధియేటర్లు నెమ్మదిగా తెరుచుకోగానే విడుదలైన ‘ఉప్పెన’ ఆతరువాత ‘వకీల్ సాబ్’ మూవీలు ఘనవిజయం సాధించడంతో ఈసంవత్సరం అంతా మెగా హీరోల రిలీజ్ హవా బాగా కనిపిస్తుందని అంచనాలు వేసారు. అయితే ఈఅంచనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ తో మళ్ళీ సినిమా ఇండస్ట్రీ పూర్తిగా స్థంభింఛి పోయింది. సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ కూడ నిలిచి పోయాయి. విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు కూడ తమ రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకున్నాయి.
పదుల సంఖ్యలో సినిమాలు విడుదల ఆగిపోతే షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాల ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో మెగా ఫ్యామిలీ నుండి ఈఏడాది ఎన్నో సినిమాలు రావాల్సి ఉంది. ఈ సంవత్సరం కనీసం డజను పైగా మెగా మూవీస్ వస్తాయనుకుంటే సెకండ్ వేవ్ వల్ల ఆ అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. చిరంజీవి ‘ఆచార్య’ పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలు విడుదల కావడానికి మరో నాలుగు నెలలు పైగా పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
ఈమూవీలతో పాటు చరణ్ నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కూడ ఈసంవత్సరం విడుదల కాకపోవచ్చు. ఈలిస్టులో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ వరుణ్ తేజ్ గని’ ‘ఎఫ్ 3’ సినిమలు కూడ తమ సినిమాల విదుదల తేదీలలో మార్పులు చేసుకునే ఆస్కారం ఉంది. అదేవిధంగా కళ్యాణ్ దేవ్ లేటెస్ట్ మూవీతో పాటు వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ మూవీల విషయంలో కూడ కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. దీనితో ఈ సెకండ్ వేవ్ పరిస్థితులు వల్ల మెగా హీరోలు ఈ ఏడాది పై పెట్టుకున్న ఆశలు అన్నీ చాలామటుకు నెరవేరక పోఅచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..