రాజమౌళికి కనువిప్పు కలిగించిన రాథే !
సల్మాన్ ఖాన్ కు రంజాన్ తో ఉన్న సెంటిమెంట్ రీత్యా ఈమూవీని రంజాన్ కు ఒకరోజు ముందుగా విడుదల చేసారు. వాస్తవానికి ‘రాదే’ ను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తారని ముందు ప్రకటించారు. అయితే ఉదయం 11 గంటలకే స్ట్రీమింగ్ మొదలైంది. కొందరు అప్పట్నుంచే సినిమా చూడ్డం మొదలుపెట్టారు. 12 గంటలకు టైమింగ్ నోట్ చేసుకుని అప్పుడు సినిమా చూద్దామని ఒక్కసారిగా అభిమానులు ఈ ఓటీటీ మీద పడటంతో సర్వర్ క్రాష్ అయిపోయింది.
దీనితో క్రాష్ అయిన సర్వర్ ను గాడిలో పెట్టడానికి కొన్ని గంటలు సమయం పట్టింది. ‘రాదే’ మూవీని మొదటిరోజు మొదటి షో చూడాలని ఆశపడ్డ సల్మాన్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఈ అనుభవాలు కొంతవరకు రాజమౌళికి కూడ జ్ఞానోదయం కలిగించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి భారీ కలక్షన్స్ రాబట్టడానికి ఈ మూవీని ధియేటర్లలో విడుదల చేస్తూనే ‘రాదే’ లాగే పే పర్ వ్యూ’ పద్ధతిలో విడుదల చేయాలని రాజమౌళి ఆలోచనలలో ఉన్నాడు అన్నవార్తలు వస్తున్నాయి.
‘ఆర్ ఆర్ ఆర్’ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీని లక్షలాది మంది మొదటిరోజునే చూడాలని ప్రయత్నిస్తారు కాబట్టి ఇలా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ప్రసారం చేసే సర్వర్ క్రాష్ అయితే పరిస్థితి ఏమిటి అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో గ్రాఫిక్ వర్క్స్ చాల ఎక్కువగా ఉండే పరిస్థితులలో ఈమూవీని ఓటీటీ లో కంటే ధియేటర్లలోనే చూడటానికి ఇష్టపడతారు కాబట్టి పూర్తిగా కరోనా పరిస్థితులు సద్దుమణిగి థర్డ్ వేవ్ పై ఒక క్లారిటీ వచ్చిన తరువాత మాత్రమే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ‘రాదే’ లా రాజమౌళి ప్రయోగాల వైపు వెళ్ళే ఆస్కారం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..