అబ్బే.. ప్రభాస్ ఇప్పట్లో ఫ్యాన్స్ కోరిక తీర్చేలా లేడుగా?

praveen
ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ ఓ ఇంటి వాళ్లు అవుతున్నారు.  అయితే అందరి హీరోల పెళ్లిళ్లు అవుతున్నాయి కానీ అటు ఎన్నో రోజులనుంచి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఎక్కడా క్లారిటీ రావడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రభాస్ పెళ్లి గురించి టాలీవుడ్లో ఆసక్తికర టాక్ కొనసాగుతూనే ఉంది. ఈశ్వర్ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ఏకంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్వాంటెడ్ హీరోగా మారిపోయాడు.  బాహుబలి తర్వాత ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.



 ఇలా అంతకంతకూ క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ ఎందుకో అభిమానుల కోరిక మాత్రం తీర్చడం లేదు.  ప్రభాస్ పెళ్లి జరిగితే చూడాలని అభిమానులు అందరూ ఎంతో నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన టాక్ వినిపించినప్పటికీ ఇప్పుడు వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. గతంలో కాజల్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని...  కొన్ని రోజులు వార్తలు రాగా ఆ తర్వాత ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి.  కొన్ని రోజుల్లోనే ఇవేవీ నిజాలు కావు పూర్తిగా పుకార్లు అన్న దానిపై క్లారిటీ వచ్చింది.



 అయితే ఇక అటు ఇప్పటికే కాజల్ కి పెళ్లి అయిపోయింది. అనుష్క కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని అంటున్నారు. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అభిమానులు అడుగుతున్నారు. ప్రభాస్ ఇప్పటికైనా తన పెళ్లి గురించి క్లారిటీ ఇస్తాడా లేదా అన్నదానిపై వేచి చూస్తున్నారు అభిమానులు.  ఇప్పటికే 40 ప్లస్ లో ఉన్న ప్రభాస్ ఇప్పటికి కూడా పెళ్లి గురించి ఆలోచించకపోవడం మాత్రం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది.  ఏదేమైనా ఇప్పటికే ఎంతోమంది యువ హీరోలు పెళ్లి చేసుకుంటే అటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న ప్రభాస్ కి మాత్రం ఇంకా పెళ్లి పై దృష్టి రావడం లేదు అన్నది అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: