పెళ్లి తర్వాత ఈ అమ్మడు నటనకు గుడ్ బై చెప్పనుందా ?
అయితే తాజాగా తన క్లోజ్ ఫ్రెండ్ మంచు లక్ష్మితో కలసి జెమినీ లో ప్రసారం అవుతున్న నెంబర్ వన్ యారి షో లో ప్రత్యక్షమయ్యారు రకుల్ . ఈ షోకి దగ్గుబాటి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో తనకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. అలా సంభాషణ మధ్యలో రకుల్ పెళ్లి టాపిక్ రాగా ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు రకుల్ పెళ్లి చూస్తారంటూ ప్రకటించింది మంచు లక్ష్మి. ఓ వైపు రకుల్ కాదంటున్నా వినకుండా, లక్ష్మి కనీసం ఈ పంజాబీ బేబీ కి పెళ్లి సంబంధాలు చూస్తారని, లేకపోతే బాయ్ ఫ్రెండ్ అయినా వస్తాడని పేర్కొంది . ఇక ఆ అదృష్టవంతుడు ఎవరో గాని నా దగ్గరకు వస్తే రకుల్ గురించి పూర్తి విషయాలు చెప్పి పంపిస్తా అంటూ సరదాగా రకుల్ ని ఆటపట్టించింది మంచు లక్ష్మి.
ఈ సందర్భంగా గతంలో తనపై వచ్చిన ఓ రూమర్ కి క్లారిటీ ఇచ్చింది రకుల్. ఇంతకముందు రకుల్ - రానా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు చాలానే పుట్టుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదు మేమిద్దరం చాలా మంచి స్నేహితులం అంటూ, ఒక స్నేహితుడిగా రానా అంటే నాకు చాలా గౌరవం, అభిమానం ఉంది అంటూ క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇదంతా ఇలా ఉంటే...రకుల్ ప్రీత్ ఒకవేళ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటే, ఆ తరువాత సినిమాలలో నటిస్తుందా ? లేదా పూర్తిగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుందా తెలియాల్సి ఉంది. ఇప్పటికే సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఉండి పెళ్లి చేసుకున్న తారలు నటిగా కొనసాగుతున్నారు. అందులో కాజల్ అగర్వాల్ పేరు ముందుగా చెప్పుకోవచ్చు. మరి ముందు ముందు ఏమి జరగనుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు.