సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

VAMSI
సాయిపల్లవి తెలుగు సినీ ప్రేక్షకులకు దక్కిన ఓ ఆణిముత్యం. హీరోయిన్ అంటే సినిమాకి గ్లామర్ అనుకునే ఈ రోజుల్లో స్కిన్ షో చేయకపోయినా తమ టాలెంట్ తో టాప్ హీరోయిన్ గా కొనసాగొచ్చని ప్రూవ్ చేసిన అతి కొద్దిమంది కథానాయికలలో ఈమె కూడా ఒకరు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా రాణిస్తోందంటే అది సాధారణమైన విషయం కాదు. సాయి పల్లవి ఇంతటి ఘన విజయం వెనుక దాగిన సీక్రెట్స్ ను ఇపుడు తెలుసుకుందాం. సాయి పల్లవి చాలా చిన్న పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి. తమిళనాడులోని ఊటీకి దగ్గరగా ఉన్న కొత్తగిరి అనే చిన్న గ్రామం. సాధారణ అమ్మాయిలు లాగే బాల్యం కూడా గడిచింది. తల్లి రాధామణి. గొప్ప నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె, చెల్లెలు పూజ వీరిద్దరు కవల పిల్లలు.

అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి డాన్సర్ కావడం వలన ఆ ప్రభావంతో సాయి పల్లవి కూడా చిన్నప్పటి నుండే డ్యాన్సు పై మక్కువ ఉండేది. ఆ ఆసక్తితోనే డాన్స్ నేర్చుకునేది. పాఠశాలలో, పలు వేదికల మీద ఎంతో అద్భుతంగా నాట్యం చేసేది. అప్పట్లో ఈమె ప్రతిభ గుర్తించిన ఉపాధ్యాయురాలు ఒకరు ఫ్యూచర్ లో నువ్వు  డాన్సర్ గా గొప్ప స్థాయికి చేరుకుంటావు అంటూ కితాబు ఇచ్చింది.  ఈమె ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఆమె నాట్యం చూసిన ఓ డైరెక్టర్ ధూం ధాం అనే తమిళ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది.

అయితే ఇవన్నీ గుర్తింపు తీసుకు రాకపోగా, ఈటీవీలో 2013 లో వచ్చిన ఢీ  లాంటి బిగ్గెస్ట్ డాన్స్ షో లో తన ప్రతిభతో స్థానం దక్కించుకుంది. అప్పట్లో ఢీ షోకి ఒక జడ్జ్ గా వ్యవహరిస్తున్న హీరోయిన్ రంభ సాయి పల్లవి డాన్స్ కి ఫిదా అయిపోయి నువ్వు సూపర్ టాలెంటెడ్ రైట్ లో చూస్తే ఐశ్వర్య రాయ్ లాగా, లెఫ్ట్ లో చూస్తే మాధురిధీక్షిత్ లాగా ఉన్నావు. ఇక డాన్స్ లోని గ్రేస్ సల్మాన్ ఖాన్ లా ఉంది అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. అందరూ కూడా నువ్వు ఓ బ్యూటిఫుల్ గర్ల్, పవర్ఫుల్ డాన్సర్...తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతావంటూ సాయిపల్లవిని ఆకాశానికెత్తేశారు. ఒక అమ్మాయి అప్పట్లో ఢీ వంటి పెద్ద షో లో అవకాశం దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ తర్వాత షో లో కొనసాగడానికి ఎంతో శ్రమించింది. చాలా ఇంటర్వ్యూలలో ఇంతలా మీరు సక్సెస్ అవ్వడానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు సాయి పల్లవి సమాధానంగా మన పని పట్ల మనకు ఇష్టం ఉండాలి. అదే మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది అని చాలా సింపుల్ గా చెప్పేది.

తమిళ దర్శకుడు అల్ఫోన్సో  అవకాశం ఇవ్వడం తో ప్రేమమ్ చిత్రంలో నటించింది. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిధా చిత్రంలో హీరోయిన్ గా తన సత్తా చాటింది. ఈ సినిమాతో అటు వరుణ్ తేజ్, ఇటు సాయి పల్లవి ఇద్దరూ బాగా పాపులర్ అయ్యారు. సాయి వన్ పీస్ అంటూ తన పర్ఫార్మెన్స్ తో తెలంగాణ స్లాంగ్  తో అదరగొట్టేసింది. ఇక ఆమె సినీ జీవితం ఫుల్ బిజీ గా మారి నేడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది సాయి పల్లవి. పని పట్ల తనకున్న అంకుఠిత దీక్ష అంకిత భావమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని ఎంతోమంది చెబుతుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం నాకంటూ ఏవీ ప్రణాళికలు ఉండవని అనుకున్నది చేసుకుంటూ పోతానని చెప్పేది. ఈ రోజు తన పుట్టినరోజు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: