పూజ హెగ్డే క్వారెంటైన్ సీక్రెట్ !
నిన్న మొన్నటి వరకు వరసపెట్టి సినిమాలు చేస్తూ ఒక్క క్షణం ఖాళీ లేకుండా కాలం గడిపిన ఈమెకు ఇప్పుడు ఖాళీ దొరకడంతో ప్రస్తుతం తాను ఏమి చేస్తున్నానో వివరిస్తూ తన దిన చర్యను తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం తనకు వచ్చిన కరోనా పాజిటివ్ వల్ల తనకు ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ రాకుండా ప్రస్తుతం తాను ఎక్కువ సేపు ధ్యానం యోగా చేస్తూ తనకు నచ్చిన పుస్తకాలను చదువుతున్న విషయాన్ని తెలియ చేసింది.
తనకు వచ్చిన కరోనా తనను బాదించడం లేదనీ కేవలం తనకు తేలికపాటి కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఎవరికైనా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడితే భయపడకుండా శ్వాస కు సంబంధించిన వ్యాయామాలు అలాగే ప్రాణాయామం చేస్తే చాలు అన్ని సమస్యలు తీరిపోతాయి అని అంటోంది.
ఇప్పటికే తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుకున్న పూజ త్వరలో తమిళ విజయ్ తో ఒక మూవీ అలాగే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో మరొక మూవీ చేస్తూ కోలీవుడ్ బాలీవుడ్ లలో కూడ నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు టాప్ యంగ్ హీరోలతో నటిస్తూనే ఈమె అఖిల్ లాంటి హీరోలతో కూడ నటిస్తోంది. ‘అల వైకుంఠ పురములో’ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ తో మరింత క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన పూజ హెగ్డే ప్రస్తుతం తన పారితోషికాన్ని 2 కోట్ల స్థాయిని చేరుకుంది. ప్రస్తుతం ఈమెకు రష్మిక నుండి గట్టి పోటీ ఎదురౌతున్న పరిస్థితులలో ఆమె తన మూవీ ప్రాజెక్ట్స్ ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది..