ఆ విషయంలో త్రిష , కీర్తి ఇద్దరూ సమానమే..!

Divya

టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఈ రెండు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. ఇక ప్రస్తుతం ఈమె నటించిన "పరంభద" అనే సినిమా ఓటీటీలో విడుదలై, మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈమె రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, హీరోని బట్టి, కథను బట్టి  ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుంచి రెండున్నర కోట్ల రూపాయల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఇంతలా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది త్రిష.


అయితే ఈమె మొదట్లో సినిమా అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు,  తొలి సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించింది. ఇక అందుకు ఆమెకు ఐదు వందల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుందట. ప్రస్తుతం 500 రూపాయలు అంటే తక్కువ మొత్తం అయినప్పటికీ, అదే 20 సంవత్సరాల క్రితం రూ.500 అంటే చాలా ఎక్కువ మొత్తమే అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం తెలుగులో లూసిఫర్ రీమేక్  సినిమాలో త్రిష నటించబోతున్నట్లు సమాచారం. ఇక మిగతా విషయానికొస్తే ఈమెకు తెలుగు లో భారీగా ఆఫర్లు లేకపోయినప్పటికీ, తమిళంలో మాత్రం భారీగా ఆఫర్లు ఉండడం గమనార్హం..


అలాగే స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ విషయానికొస్తే, ఈమె కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఊహ తెలిసిన తర్వాత ఈమె మొదటి సంపాదన రూ.500 అని చెప్పుకొచ్చింది. కాలేజీ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో కొన్ని కొన్ని షోలలో పాల్గొనే వారని, ఆ సమయంలో 500 రూపాయలను పారితోషికంగా పుచ్చుకున్నానని కూడా కీర్తి సురేష్ తెలిపింది..


ఇక ప్రస్తుతం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ హీరోయిన్లు, ఒకప్పుడు కేవలం వందల్లో మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారు. అందులోనూ కీర్తి, త్రిష తొలి సంపాదన కేవలం 500 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: