పవన్ తో ఎకానమీ పై ఆసక్తికర చర్చలు !

frame పవన్ తో ఎకానమీ పై ఆసక్తికర చర్చలు !

Seetha Sailaja

టాప్ హీరోల సినిమాలు అంటే వందల కోట్లలలో బడ్జెట్ అవుతుంది. టాప్ హీరోలు భారీ పారితోషికాలు తీసుకోవడమే కాకుండా తాము నటించే సినిమాలకు సంబంధించిన కీలక నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో కూడ సలహాలు ఇస్తూ ఒకవేళ వారు ఇచ్చే సలహాలు వల్ల సినిమా బడ్జెట్ పెరిగినా నిర్మాతకు వచ్చే కష్టాల గురించి పట్టించుకోరు అన్నమాటలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.


పవర్ స్టార్ నటించే సినిమాలకు సంబంధించి భారీ పారితోషికాన్ని తీసుకుంటాడు కాని తన మూవీలో నటించే నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో ఎలాంటి ప్రమేయం కల్పించుకోడనీ ఈవిషయంలో పవన్ తీరు చాల విభిన్నం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ విషయాన్ని ఉదాహరణగా చూపెడుతున్నారు.


తాను నటించే సినిమాకు సంబంధించి పారితోషికంగా 50 కోట్లు తీసుకుంటాడు కాని తన సినిమాలో పలానా వ్యక్తి పలానా పాత్ర పోషించాలి అన్న కండిషన్స్ ఎప్పుడు పవన్ పెట్టాడు అన్నమాటలు ఉన్నాయి. ముఖ్యంగా టాప్ హీరోలు తమ సినిమాలలో క్వాలిటీ కోసం పది నిముషాల పాత్రకు కూడా తమకు ఫలానా ఆర్టిస్ట్ కావాలని అతడి పేరు చెపుతూ ఉంటారు. అయితే ఇలాంటి ఒత్తిడులు పవన్ నుంచి ఉండవు అని అంటారు. ‘వకీల్ సాబ్’ మూవీలో అత్యంత కీలకమైన కోర్ట్ సీన్స్ కు సంబంధించి జడ్జి పాత్రకు ఏమాత్రం పేరులేని ఒకనటుడుని తీసుకున్నారు కానీ అదే మరో టాప్ హీరో అయితే ఆపాత్రకు కూడ తమకు పేరున్న నటుడు కావాలని పట్టుపట్టి ఉండేవారని కొందరి అభిప్రాయం.


అదేవిధంగా ‘వకీల్ సాబ్’ మూవీలో కీలకమైన అమ్మాయిల పాత్రలను పోషించిన పాత్రలలో పూర్తిగా ఇమేజ్ కోల్పోయిన అంజలి నటించినా పవన్ అభ్యంతరం చెప్పలేదనీ అదే మరొక టాప్ హీరో అయితే ఆపాత్రను కూడ ఒక పేరున్న ఆర్టిస్ట్ తో చేయించమని పట్టుపడతాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు తమ సినిమాలను భారీ లోకేషన్స్ లో భారీ ఖర్చుతో తీయాలని టాప్ హీరోలు ఒత్తిడి చేస్తారని ఈవ్ ఇషయంలో కూడ పవన్ నుంచి ఏనిర్మాతకు ఎటువంటి ఒత్తిడి ఉండక పోవడంతో పవన్ ఎకానిమీ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: