
ఆ సినిమాలే త్రిషకు బ్రేక్ ఇచ్చాయా?
వర్షం:
త్రిష తెలుగు తెరకు పరిచయమైన మొదటి.ప్రబాష్ హీరోగా నటించారు.. ఈ సినిమాలో త్రిష న్యాచురల్ గా కనిపిస్తుంది..సాంగ్స్, డ్యాన్స్, డైలాగులు, ముఖ్యంగా ప్రేమను పంచే మనసులు ఇవన్నీ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి..
పౌర్ణమి:
ఈ సినిమాలో కూడా ప్రభాస్ హీరో గా నటించాడు.. ఈ సినిమాలో త్రిష పాత్ర ఎక్కువ సేపు లేకున్నా కూడా మంచి క్రెడిట్ ను అందుకుంది. త్రిష కు ఈ సినిమా అవార్డును కూడా తెచ్చి పెట్టింది..
అతడు:
అతడు.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ త్రిష నటించింది.. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సూపర్ , డుపర్ హిట్ అనే చెప్పాలి.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. ఈ సినిమా వల్ల త్రిష ఎక్కడికో వెళ్లిపోయింది..
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే:
వెంకటేష్ కు జోడిగా ఈ సినిమాలో నటించింది.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తర్వాత సినిమాలో నటించే ఛాన్స్ ను ఈజీగా పట్టేసింది..
నువ్వొస్తానంటే నేనొద్దంటానా:
సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా లో త్రిష హీరోయిన్.. అయితే ఈ సినిమాకు త్రిషకు మంచి పేరును తీసుకొచ్చింది.
నీ మనసు నాకు తెలుసు, లయన్ , స్టాలిన్, సైనికుడు, కృష్ణ, నమోవెంకటేసా ఇలా చాలా సినిమాలో నటించింది.. గత కొంతకాలంగా తెలుగులో ఒక్క సినిమా కూడా రాలేదు.. ఇటీవల మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైయిపోయింది. లేడీ ఒరియంటెడ్ కథలను ఎచ్చుకుంటు వరుస విజయాలు అందుకుంటోంది. ఇటీవల ఆమె నటించిన పరమపదం అనే మూవీ ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా త్రిష మరోసారి ప్రేమలో పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన ఆమె అతడితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి పై మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి.. ఏది ఏమైనా కూడా ఈరోజు త్రిష పుట్టిన రోజును జరుపుకుంటుంది.. ఇలాగే ఎప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ప్రేక్షకుల మనసును గెలుచుకోవాలని ఇండియా హెరాల్డ్ కోరుకుంటుంది.. హ్యాపీ బర్త్ డే త్రిష..