బుల్లితెర యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

N.ANJI
బుల్లితెరపై హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రదీప్‌ మాచిరాజు. తనదైన పంచ్‌లు, యాంకరింగ్‌తో సుమ కనకాల తరువాత టాలీవుడ్‌లో అంతటి పేరును సొంతం చేసుకున్న వ్యక్తి ప్రదీప్‌ ఒక్కడే. అయితే బుల్లితెర యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆయన తండ్రి పాండు రంగ క‌న్నుమూశారు.

ఆయన గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న క‌న్నుమూశారు.  బుల్లితెర యాంకర్ ప్రదీప్ కూడా వైరస్ బారిన పడ్డాడు. దీంతో బుల్లితెర కూడా తెగ వణుకుతుంది. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉండగా.. వైద్యుల సూచన మేరకు వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి ఇప్పటి వరకు ప్రదీప్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్ర‌దీప్ కి క‌రోనా సోకింద‌ని ఈమ‌ధ్య వార్త‌లొచ్చాయి. పాండు రంగ కూడా క‌రోనాతో బాధ ప‌డ్డార‌ని తెలిసింది. మ‌రి ఆయ‌న‌.. క‌రోనాతో క‌న్నుమూశారా..? లేదంటే మ‌రో కార‌ణ‌ముందా..? అనేది తెలియాల్సివుంది.

కాగా టెలివిజన్‌లో అత్తా కోడళ్ళు షోతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రదీప్‌ కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం పలు చానల్స్ లో అనేక షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్..‌ స్టార్ యాంకర్‌ కొనసాగుతున్నాడు. ఇతనికి యూత్‌, అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. అయితే టీవీ షోలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు ప్రదీప్.

ఇక బుల్లితెర‌పై తిరుగులేని స్టార్ ప్ర‌దీప్‌. 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా? సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నిర్మాత‌ల‌కు లాభాల్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఆ త‌ర‌వాత హీరోగా ప‌లు అవ‌కాశాలు వ‌చ్చినా.. ప్ర‌దీప్ అంగీక‌రించ‌లేదు. త్వ‌ర‌లోనే ఓ కొత్త ప్రాజెక్టుని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారాయ‌న‌. ఇంత‌లోనే.. త‌న ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: