పాన్ ఇండియా సినిమాలో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసారా..?

Suma Kallamadi
కన్నడ చిత్ర పరిశ్రమని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లినా సినిమా కేజిఎఫ్. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్’ అనే సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు యశ్. కేజీఎప్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్’. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన. కేజియఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు.
ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమా కన్నడలో తొలి రూ. 230 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్  చేసింది. అంతేకాదు హిందీలో దాదాపు రూ. 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే రూ. 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది.
కేజియఫ్ సినిమాకు సీక్వల్ గా కేజిఎఫ్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. రవీనా టాండన్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 విడుదల కానుంది.
అయితే ఈ సినిమాలో వింటేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటూనే మొదటి చాప్టర్ లో యాక్షన్ సాంగ్స్ డిజైన్ చేశారు. మరి అదే విధంగా మన సౌత్ వెర్షన్ కి ఒక ఐటెం సాంగ్ అలాగే బాలీవుడ్ వెర్షన్ కి ఒక ఐటెం సాంగ్ ని కూడా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి చాప్టర్ లో కూడా ఓ ఆడితే ఐటెం సాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ రెండు వెర్షన్స్ లో ఉంటుందో లేదో కానీ బాలీవుడ్ హాట్ ఐటెం భామలు జాక్వలిన్ ఫెర్నాండేజ్ నోరా ఫతేహి పేర్లు ఇప్పుడు ఆ సాంగ్ కు వినపడుతున్నాయి. మరి ఎవరితో ఈ సారి ప్లాన్ చేసారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: