నందమూరి నటసింహం బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబో లో రూపొందుతున్న 'అఖండ' సినిమా సంబంధించి టైటిల్ రోర్ విడుదలై హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అఖండ టైటిల్ రోర్ య్యూటూబ్లో కేవలం 16 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సంపాదించి టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది. కేజీఎఫ్ మూవీ తర్వాత స్థానంలో 'అఖండ' టైటిల్ రోల్ నిలవడం గమనార్హం. ఐతే సోషల్ మీడియాలో బాలకృష్ణ కి చాలా తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని.. అలాంటిది ఆయన యొక్క అఖండ టైటిల్ రోర్ కి కేవలం 16 రోజుల్లోనే 5 కోట్ల వ్యూస్ ఎలా వస్తాయని కొందరు నెటిజన్లు ఓ చర్చకు తెరలేపారు.
అఖండ టైటిల్ రోర్ క్రియేట్ చేసింది ఒక ఫేక్ రికార్డని.. అఖండ మూవీ టీం ఫేక్ యూట్యూబ్ వ్యూస్ కొనుగోలు చేయడం వలన ఆ స్థాయిలో వ్యూస్ వచ్చాయని ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. భారీ మోసం చేయడం వల్లే బాలకృష్ణ మూవీ ఈ ఫీట్ సాధించగలిగింది అని మరికొంత మంది నెటిజన్లు ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో విడుదలైన బాలకృష్ణ సినిమాల టీజర్ల వ్యూస్ గమనిస్తే ఒక కోటి మార్కు కూడా దాటలేదని.. కానీ ఇప్పటికిప్పుడు 5 కోట్ల వ్యూస్ ఎలా వచ్చాయని వారు ప్రశ్నిస్తున్నారు.
అయితే దీనికి కౌంటర్ గా కొంత మంది నెటిజన్లు సమాధానాలు ఇస్తున్నారు. బాలకృష్ణ కొత్తగా అఘోర పాత్ర చేశారని.. అఘోర పాత్రలో ఆయన యాక్షన్ ఎలా ఉందోననే ఆసక్తితో మిగతా హీరోల అభిమానులు కూడా టీజర్ చూసి ఉంటారని.. అందుకే ఆ స్థాయిలో వ్యూస్ వచ్చి ఉంటాయని.. కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే అల్లుఅర్జున్ పుష్పరాజ్ ఇంట్రో వీడియో 20 రోజుల్లో 50 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆ స్థాయిలో ఇంట్రో వీడియో కి వ్యూస్ రావడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు అల్లు అర్జున్ కి భారత దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనివల్ల పుష్పరాజ్ వీడియోకి 50 మిలియన్ల 20 రోజుల్లో వచ్చాయి. తమిళ హీరో విజయ్, టాలీవుడ్ హీరో జూ. ఎన్టీఆర్ టీజర్స్ కూడా 5 కోట్ల వ్యూస్ తో రికార్డ్స్ సృష్టించాయి.