తమిళ చిత్ర రంగంలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్న హీరో అజిత్ ఎన్నో యాక్షన్ సినిమాలు చేసి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. సింప్లిసిటీ కి మారుపేరైన అజిత్ కేవలం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తారు. అయితే ఆయనకు ఎవరైనా డైరెక్టర్ నచ్చితే వారితో వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధం అవుతారు. గతంలో "శౌర్యం" ఫేమ్ డైరెక్టర్ శివ తో కలిసి వరుసగా నాలుగు సినిమాల చేసి ఆశ్చర్యపరిచారు. 'వీరం' సినిమాతో తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్ ప్రారంభమయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అజిత్ శివ కి మరో ఛాన్స్ ఇచ్చారు. దీంతో శివ 'వేదాళం' సినిమాతో అజిత్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు.
వీళ్లిద్దరి కలయికలో ముచ్చటగా మూడోసారి వచ్చిన ‘వివేగం’ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది కానీ అజిత్ మాత్రం శివ కి మరో ఛాన్స్ ఇచ్చి 'విశ్వాసం' సినిమా చేయగా.. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అనంతరం శివ నుంచి బ్రేక్ తీసుకొన్న అజిత్ యువ డైరెక్టర్ హెచ్. వినోద్ తో కలిసి ‘నీర్కెండ పార్వై’ సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. పింక్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాకి వినోద్ అద్భుతమైన దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. దీంతో డైరెక్టర్ వినోద్ ప్రతిభ కూడా అజిత్ కి బాగా నచ్చేయడంతో అతనితో కలిసి వాలిమై సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
అంతేకాదు అతడితో కలిసి మరొక సినిమా చేయడానికి కూడా అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీకి బోనీకపూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారని సమాచారం. వాలిమై సినిమా ఈ ఏడాది లోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకురాలు అయిన సుధా కొంగర తో కలిసి అజిత్ ఓ మూవీ చేయనున్నారు. ఆ తర్వాత వినోద్ తో కలిసి ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. దీన్నిబట్టి ఎవరైనా డైరెక్టర్ నచ్చితే వారితో వరుసగా సినిమాలు చేయడానికి అజిత్ ఇష్టపడతారని స్పష్టమవుతోంది.