ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!
ఇక రామ్ చరణ్ భార్యగా కంటే కూడా ఎక్కువగా అపోలో వైస్ ఛైర్మెన్‌గా ప్రజలకు మరింత చేరువవుతుంది ఉపాసన. మెగా కోడలిగా తన బాధ్యత నిర్వర్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. 32 లక్షల ఫాలోయర్స్ సంపాదించుకుంది మెగా కోడలు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే రేణు దేశాయ్ ఇప్పటికీ మన ప్రేక్షకులకు పరిచయం. ఈమె కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. తన వివరాలను అందులో పోస్ట్ చేస్తుంటుంది. రేణు దేశాయ్‌కు 6.89 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రతకు ఉత్తమ గృహిణి అవార్డ్ ఇవ్వాలేమో..? భర్త సినిమాలతో బిజీగా ఉంటే ఈమె ఆయన పనులతో పాటు సోషల్ మీడియాలో కూడా అభిమానులకు అన్ని ముచ్చట్లు చెప్తుంటుంది. ఈమెకు ఇన్‌స్టాలో 21 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. నాగార్జున భార్యగా తన బాధ్యత నిర్వరిస్తూనే.. మరోవైపు మూగజీవాలను రక్షిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంది అమల అక్కినేని. ఈమెకు ఇన్‌స్టాలో 1.98 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
సమంత అక్కినేని కూడా హీరోయిన్ కావడం వల్ల సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది సమంత. అక్కినేని కోడలిగా మారిన తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగింది. 16.5 మిలియన్స్‌కు పైగా ఇన్‌స్టా ఫాలోయర్స్‌తో రికార్డులు తిరగరాస్తుంది సమంత. నాని భార్యగా అంజనా చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈమెకు సోషల్ మీడియాలో 1 లక్ష 32 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. తాజాగా పాట పాడుతూ అంజనా చేసిన వీడియో వైరల్ అవుతుంది.