తాప్సీ దెబ్బకు...హడలిపోయిన నెటిజన్...?

VAMSI
" data-original-embed="">

సినీ పరిశ్రమలో ఉన్న లేడీ సెల్రబిటీలలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే తక్కువ మందిలో హీరోయిన్ తాప్సి ఒకరు. నిత్యం ఈమె ఏదో ఒక వార్తతో సంచలనంగా మారుతూ ఉంటుంది. అదే విధంగా సెలెబ్రిటీలు ఏదైనా చాట్ చేసినా లైవ్ వీడియోస్ పోస్ట్ చేసినా వారిని కామెంట్ చేయడానికి కొంతమంది నెటిజన్లు రెడీగా ఉంటారు. వారు ఏ పనిచేసినా కూడా అందులో ఏదో ఒక తప్పు వెతికి వారిని తమ కామెంట్లతో టార్గెట్ చేయడం అలవాటుగా మారిపోయింది.  ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో స్థిరపడింది. వాస్తవంగా తెలుగు సినీ పరిశ్రమతోనే తన కెరీర్ ప్రారంభమయినా అక్కడ అవకాశాలు తగ్గడంతో బి టౌన్ కి షిఫ్ట్ అయింది. అయితే ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ.. తన నటనతో తాప్సీ ప్రతీ ఒక్కరి అభినందనలు పొందుతూ వస్తుంది. కానీ నటిగా మంచి పేరు తెచ్చుకున్నా కెరీర్ మాత్రం అంతా ఫాస్ట్ గా ఏమీ లేదు.

ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సెలబ్రిటీ ప్రస్తుత సామాజిక సమస్యలపై స్పందించడం తరచూ చూస్తూనే ఉన్నాము. ఈ రోజుల్లో సెలెబ్రిటీలు ఏదైనా విషయాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలంటే ట్విట్టర్ లేదా ఇంస్టాగ్రామ్ ఎక్కువగా వాడుతున్నారు. ఇదే విధంగా ఈ మధ్య తాప్సి చేస్తున్న ట్వీట్లు కొంతమందికి నచ్చకపోవడంతో..ఈమెపై ట్వీట్ల దాడికి దిగుతున్నారు. అయితే ఇప్పుడు ఈమె చేసిన ఒక సహాయక చర్య ప్రయత్నం బెడిసి కొట్టింది. కరోనా కారణంగా అవసరమయిన వారికి సహాయాన్ని అందించే కార్యక్రమాల్లో భాగంగా ట్వీట్ రూపంలో అభ్యర్థిస్తోంది.  ఇలాంటి సమయంలో కూడా కొందరు పనీ పాటా లేని వాళ్ళు ఆమెను లక్ష్యంగా చేసుకుని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

తాప్సి ఇప్పుడు ఒక నెటిజెన్ చేసిన ట్వీట్ ను అందరితో పంచుకుంది..ఆ ట్వీట్ లో ఆ నెటిజన్ ఈ విధంగా అంటున్నాడు..."ఇలా పని మొత్తం ట్విట్టర్‌లోనే చేస్తావా.. నీ కారు ఇవ్వు పున్ను.. ఈమెకి కేవలం ఆపకుండా మాట్లాడటం మాత్రమే వచ్చు’ అన్నాడు. ఈమె ఈ కామెంట్ కు తన స్టయిల్లోనే కౌంటర్ ఇచ్చింది. ‘నోరు మూసుకో.. ఇలాంటి మాటలే నువ్వు మాట్లాడాలి అనుకుంటే.. ఈ దేశంలో పరిస్థితులు మెరుగై ప్రతీ ఒక్కరు సాధారణంగా ఊపిరి తీసుకొనే వరకూ నువ్వు నోరు మూసుకొని ఉండు. నా టైమ్‌లైన్‌పై ఇలాంటి చెత్త పోస్ట్ చేసి.. నా సమయాన్ని వృధా చేయకు. నేను చేసే పనిని నన్ను చేసుకోనివ్వు’ అంటూ తాప్సీ రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్ తో ఆ వ్యక్తి బిత్తరపోయాడు. వెంటనే డిలీట్ తను చేసిన కామెంట్ ను తొలగించాడు. మనము ఒక్క విషయం గుర్తించుకోవాలి ఎప్పుడైనా మనకు ఎవరికైనా సహాయం చేయకపోయినా పర్లేదు...సహాయం చేసే వారిని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు. ఇకనైనా ఇలాంటి వారికి బుద్ది రావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: