ఆర్ఆర్ఆర్ మూవీలో ఆ సాంగ్ హైలైట్ కానుందట..!
ఇదే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. తారక్ సైలెంట్ గా సెట్స్ లోకి వచ్చి తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేసి మళ్లీ సైలెంట్ గా వెళ్లిపోతారని.. ఎవరి మీద ఏ విషయంలోనూ ఆయన కోప్పడరని ప్రశాంత్ చెప్పుకొచ్చారు. తారక్ సెట్స్ లో టైం వృధా చేస్తుండగా తాను ఒక్కసారి కూడా చూడలేదని ఆయన అన్నారు.
ఇకపోతే కరోనా తీవ్రత దృష్ట్యా ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ షూటింగ్ నిలిపివేసింది. 85 శాతం చిత్రీకరణ పూర్తవగా.. మిగిలిన చిత్రీకరణ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం సోనూ సూద్, రామ్ చరణ్, చిరంజీవి ఆచార్య మూవీ సెట్స్ లో షూటింగ్ నిమిత్తం కలిశారు. అనంతరం సోనూ సూద్ కి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో చిరంజీవి, రామ్ చరణ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. మరోవైపు ఆలియా భట్ కరోనా నుంచి రికవర్ అయ్యి సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు కానీ రాజమౌళి మాత్రం కరోనా తగ్గు ముఖం పట్టేంతవరకు షూటింగ్ స్టార్ట్ చేసే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పేశారు.