పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి దివ్య స్పందన..!
ఇక శాండల్‌వుడ్ హీరోయిన్ రమ్య సినిమాలకు, రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ ఎంపీగా, రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలిగా వ్యవహరించిన రమ్య ‘దివ్య స్పందన’గా నెటిజన్లకు సుపరిచితురాలు. సినిమాలు, రాజకీయాలు ఆశించిన విధంగా లేవని.. అందుకే గుడ్‌బై చెబుతున్నట్లు ఆమె చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని రమ్య పేర్కొన్నారు.
అయితే తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘నాగరహావు’ ఆమె చివరిగా నటించిన చిత్రం కావడం గమనార్హం. ఈ సినిమా తెలుగులో ‘నాగభరణం’ పేరుతో విడులైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రమ్య పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమయ్యారు.
ఆమె కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. సోషల్ మీడియాలో బీజేపీ నేతలపై.. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించేవారు. ఈ సందర్భంలో ఆమె కొన్నిసార్లు వివాదాలకు కూడా తెరలేపారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి ఆమె కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు.
తాజాగా రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలుకుతున్నట్లు చెప్పేశారు. అభిమానులతో చిట్‌చాట్‌లో భాగంగా పెళ్లిపై కూడా రమ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి దాకా తనకు పెళ్లి కాలేదని తెలిపారు. డేటింగ్‌లు కూడా చేయడం లేదని చమత్కరించారు. పెళ్లి ఎప్పుడని ఓ అభిమాని అడగ్గా.. ‘పెళ్లి.. పెళ్లి.. పెళ్లి.. ఎప్పుడూ ఇదొక్కటే పనా’ అని కాస్త రుసరుసలాడారు.