స్టార్ హీరోయిన్: కరోనా వలన నాకేమి బాధగా లేదు...?

VAMSI
దేశమంతా కరోనా వైరస్ విజృంభణ మాములుగా లేదు. కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. కరోనా నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. భారతదేశ ప్రముఖ డాక్టర్లు మరియు వైద్య శాస్త్రజ్ఞులు కరోనా కు సంబంధించిన సమాచారం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తూనే ఉన్నారు. కరోనా ప్రభావం వలన ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరిమిత లాక్ డౌన్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మరియు మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మెల్ల మెల్లగా అన్ని రంగాలపై దీని ప్రభావం పడుతోంది. ముందుగా సినిమా రంగం ఇప్పటికే జరగవలసిన షూటింగులను ఆపేసింది.
అంతే కాకుండా కొంతమంది సినీ తారలు ప్రజలకు కరోనా బారిన పడకుండా ఉండడానికి ఎప్పటికపుడు సోషల్ మీడియా వేదికగా వారికి తగు సూచనలను అందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కరోనా వచ్చినప్పుడు దేశమంతా తప్పని పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించింది. ఆ సమయంలో సినిమా షూటింగులు లేక ఇంటిలో ఉండడంతో నేను చాలా బాధపడ్డానని, ఏమి చేయాలో తెలియలేదని రకుల్ చెప్పుకొచ్చింది. అయితే ఈ సారి మాత్రం నాకు కరోనా వలన ఎటువంటి బాధ లేదని చెప్పేసింది. ఇంకా చెప్పాలంటే రోజు వారి కూలీలు మరియు చిన్న చిన్న వ్యాపారులు ఈ కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
వారి గురించి తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. అందరూ అంటున్నట్లుగా కరోనా రావడానికి ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడం కారణం కాదు. ఒక్కసారి మన విధి రాత సరిగా లేకుంటే ఇలాంటి విపత్కర పరిణామాలు జరుగుతుంటాయని వేదాంతం చెప్పింది రకుల్. ఉదాహరణకు నాకు బాగా తెలిసినవారు కొంతమంది ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా వారికి కరోనా వచ్చిందని రకుల్ బాధపడింది. త్వరలోనే పరిస్థితి అంతా సాధారణంగా మారుతుందని అనుకుంటున్నాను అని రకుల్ ప్రీత్ సింగ్ కరోనా గురించి చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: