ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు చూడటానికి కూడా నన్ను నాగార్జున పంపలేదు..!

Divya

టాలీవుడ్ లో  ఉదయ్ కిరణ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అంతలా తన సినిమాలతో , డైలాగులతో ప్రేక్షకుల ను ఇట్టే  ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ జీవితం గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. అతని మరణం వెనుక ఏదో కారణం ఉందని, ఇప్పటివరకు కూడా  ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి గల కారణాలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అప్పట్లో  తన భార్య పై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే సీనియర్ నటి సుధ మాత్రం ఉదయ్ కిరణ్ విషయంలో ఇప్పటికి కూడా బాధ పడుతూనే ఉంటారు. తాజాగా ఆమె ఒక ఛానల్  ఇంటర్వ్యూ లో కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఉదయ్ కిరణ్ బతికి ఉన్నప్పుడు , తనకి ఒక వ్యాపారం పెట్టి ఇస్తాను అని చెప్పిందట. వ్యాపారం చూసుకోమని చెప్పా అని , సినిమాలు వద్దని సూచన కూడా ఇచ్చాను అని చెప్పుకొచ్చారు . అయితే ఉదయ్ కిరణ్ మాత్రం తన మాట వినలేదని అని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ఉదయ్ కిరణ్ మరణం  మాత్రం సినీ ఇండస్ట్రీలో శోక సంద్రం అయింది. సుధా అతని మరణం గురించి చెబుతూ. ఉదయ్ కిరణ్ మరణించిన రోజు నాగచైతన్య సినిమాలో (ఒక లైలా కోసం) షూటింగ్లో ఉన్నాను అన్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో పక్కన ఉన్న వాళ్ళు ఉదయ్ కిరణ్ మరణించాడు అని చెప్పారని, వెంటనే వెళ్లాలని చూశానని, కానీ అతని చూడటానికి సాధ్యం కాలేదు.అని ఆమె కన్నీరు పెట్టుకుంది.

నాగార్జున గారు ఫోన్ చేసి షూటింగ్ నుంచి తనను  బయటికి పంపించవద్దని చెప్పారని చెప్పుకొచ్చింది. నాగార్జున నేనే ఉదయ్ కిరణ్ మృతదేహం చూడలేకపోయానని అన్నారు. కానీ ఎందుకు చనిపోయాడు . ఉదయ్ కిరణ్ ఫోటో చూసి అడిగా అని గుర్తుచేసుకున్నారు సుధా. ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ లాంటి హీరో మరి ఎప్పుడు రాడు అని  కూడా మనం చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: