ఇక వకీల్ సాబ్ 100 కోట్ల షేర్ వసూలు చెయ్యడం కష్టమేనా?

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు.ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూ మరో పక్క వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి దాదాపు 3 ఏళ్ళ తరువాత వచ్చిన చిత్రం 'వకీల్ సాబ్'. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ లభించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా అదిరిపోయే రేంజిలో వచ్చాయి. ఇక అటు తరువాత కూడా ఉగాది,అంబేద్కర్ జయంతి సెలవులు కూడా కలిసి రావడంతో ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.


అక్కడిదాకా బాగానే వున్నా ఆ తరువాత నుండీ మాత్రం పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. 'వకీల్ సాబ్' సినిమాకి టికెట్ రేట్లు తగ్గించేసిన సంగతి తెలిసిందే.అయినప్పటికీ థియేటర్లలో జనాలు లేక రెండు వరుసల సీట్ల జనాలు కూడా ఉండడం లేదు.ఇప్పుడు కలెక్షన్లు చాలా ఘోరాతి ఘోరంగా తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే.. స్టార్ హీరోలైన చిరంజీవి, రాంచరణ్, మహేష్ బాబు వంటి వారు ఇప్పటికే 100 కోట్ల షేర్ మూవీస్ ను సాధించారు.ఇక ఆ లిస్ట్ లోకి పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఆ లిస్ట్ లో చేరలేదు. ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' తో ఆ ఫీట్ ను సాధించే అవకాశం ఉంది.


అల్లు అర్జున్ 'పుష్ప' తో దాటాలని చూస్తున్నాడు.అయితే 'వకీల్ సాబ్' తో పవన్ కళ్యాణ్ కూడా ఆ ఫీట్ ను సాధిస్తాడు అని ఆయన అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇప్పుడు 100 కోట్ల షేర్ మాట అటుంచితే.. 'వకీల్ సాబ్' బ్రేక్ ఈవెన్ అవ్వడమే కష్టంగా మారింది. 'వకీల్ సాబ్' హిట్ అనిపించుకోవాలి అంటే బాక్సాఫీస్ దగ్గర రూ.90.5 కోట్ల షేర్ ను వసూల్ చెయ్యాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ఇంకా రూ.85కోట్ల షేర్ కూడా వసూల్ కాలేదు.దీనికి పూర్తి కారణం కరోనా అనే చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వలన జనాలు ఎవరూ థియేటర్ కి రాక ఈ సినిమా అంత భారీ కలెక్షన్స్ ని నమోదు చెయ్యలేకపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: