జబర్దస్త్ 'బ్లాక్ అండ్ వైట్' జోడిని వదిలని ఈటీవీ.. ఇప్పుడు మరోసారి..?
కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం జబర్దస్త్ లో హాట్ టాపిక్ గా మారిపోయిన జంట వర్ష ఇమ్మానియేల్. జబర్దస్త్ జడ్జి రోజా వీరికి బ్లాక్ అండ్ వైట్ జోడీ అంటూ పేరు పెట్టడం ఇక ఏకంగా జబర్దస్త్ స్టేజ్ పైనే ఇమాన్యుల్ అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ పలుమార్లు వర్ష చెప్పడం కూడా ఈ జోడీ ఎంతో హాట్ టాపిక్ గా మారి పోవడం కి కారణం అయ్యింది. ప్రస్తుతం ఈ టీవీ లో ఎక్కడ చూసినా కూడా ఈ జోడి కనిపిస్తోంది. అయితే ఇక ఈ జంట మధ్య ఉన్న లవ్ ట్రాక్ ని బేస్ చేసుకుని ఈ టీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈటీవీ యాజమాన్యం.
ప్రస్తుతం ఈ కార్యక్రమం బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ అటు ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక పోతే వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ గా మారిపోయింది. అయితే మరోసారి జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జోడి ఈటీవీ నిర్వాహకులు వదలలేదు. ఇక వర్ష ఇమాన్యుల్ తో ఒక స్పెషల్ పర్ఫామెన్స్ చేశారు. ఇక ఇద్దరు కూడా పర్ఫామెన్స్ లో లీనమై అదరగొట్టారు అనే చెప్పాలి . హొయ్ రాజు కన్నుల్లో నువ్వే.. ఓయ్ రాజు గుండెల్లో నువ్వే అనే పాట పై అదిరిపోయే డాన్స్ చేశారు. ఇటీవలే విడుదలైన ప్రోమోలో వీరిద్దరి డాన్స్ పెర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయింది.