వేణు శ్రీరామ్ తో సినిమాకి భయపడుతున్న బన్నీ... అందుకేనా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ కష్టపడుతున్నాడు. అందుకే తనను స్టైలిష్ స్టార్ గా నిలబెట్టి మంచి లైఫ్ ఇచ్చిన సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పై బన్నీ ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాడు.ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అయ్యి తనను పాన్ ఇండియా హీరోని చేస్తుందనే భావనతో వున్నాడు. ఇక గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే బన్నీ ఐకాన్ సినిమా ఉంటుందా ఉండదా అని. అయితే ఈ రూమర్లు కి చెక్ పెట్టి దిల్ రాజు సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే బన్నీ మాత్రం చెయ్యాలా వద్దా అనే డౌట్ తో వున్నాడట.దానికి కారణం వేణు ట్రాక్ రికార్డు అంతగా బాగాలేదనేదే.ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీరామ్ వేణుకు ఆ సినిమా భారీ షాక్ ఇచ్చింది. సిద్దార్థ్, శృతిహాసన్, హన్సిక, నవదీప్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.


తొలి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ దిల్ రాజు శ్రీరామ్ వేణుకు మరో ఛాన్స్ ఇచ్చారు. శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో రెండో సినిమాగా మిడిల్ క్లాస్ అబ్బాయి తెరకెక్కగా ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.వేణు ఎంసీఏ సినిమాతో ప్రూవ్ చేసుకోవడంతో దిల్ రాజు పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చారు. తెలుగు నేటివిటీకి తగినట్టు పింక్ కథలో మార్పులు చేసి శ్రీరామ్ వేణు వకీల్ సాబ్ తో హిట్ కొట్టాడు. హిట్ అయితే కొట్టాడు కాని ఆ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వటానికి నానా తంటాలు పడుతుందట. అదే ఇప్పుడు బన్నీకి భయంగా మారింది. అందుకే బన్నీ ఇతనితో సినిమా చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: