ఎన్టీఆర్ లైనప్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్...

Purushottham Vinay
ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే "టెంపర్" కి ముందు ఒక లెక్క "టెంపర్" తరువాత ఇంకో లెక్క అని చెప్పాలి. ఆ సినిమా నుంచి ప్రస్తుతం దాకా వరుస హిట్లతో బ్లాక్ బస్టర్ హీరోగా మారాడు. అనేకమంది దర్శకులకి హాట్ ఫేవరేట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం తారక్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తరువాత తన స్నేహితుడు కొరటాల శివతో "జనతా గ్యారేజ్ " లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రెండవ సినిమా చేస్తున్నాడు.ఇది ఎన్టీఆర్ కెరీర్ కి 30 వ సినిమా. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ 31వ సినిమా డైరెక్టర్స్ రేసులో ప్రశాంత్ నీల్, అట్లీ, బుచ్చిబాబు సానా ఉన్నారు. ఈ ముగ్గురు డైరెక్టర్లలో ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్ లో ముందు నటిస్తారో తెలియాల్సి ఉంది.


ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి.ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కిస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఉప్పెన సినిమాతో సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలతో పాటు అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారని కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఎన్టీఆర్ సినిమా మళ్ళీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టిన ఎన్టీఆర్ లైనప్ కి అభిమానులు ఇంకా నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: