ఠాగూర్ రేంజ్ కథతో రాబోతున్న చిరు....
అయితే చిరంజీవి మళ్లీ ఠాగూర్ పాత్రను పోలిన పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం రీమేక్ లతో పాటు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలలో ఏ డైరెక్టర్ సినిమా ఫస్ట్ మొదలవుతుందో తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ డైరెక్షన్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా తెరకెక్కనుండగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇక ఠాగూర్ సినిమాలా మంచి ఎమోషనల్ డ్రామాగా చిరంజీవి బాబీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతుంది . ఠాగూర్ సినిమాలోలా సమాజంలోని లోపాలను ఎత్తి చూపే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఈ సినిమాకు దర్శకుడు బాబీ వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక ఠాగూర్ తరహాలో రాబోతున్న ఈ సినిమా మళ్ళీ ఆ సినిమా లాగే ఇంకెన్ని కొత్త రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి..