స్టార్ హీరోలతో సినిమా చేయడానికి పక్కా ప్రణాళిక వేసిన లవ్ స్టోరీ ఫిలిం మేకర్..?

Suma Kallamadi
 గోదావరి, హ్యాపీడేస్, ఫిదా వంటి మనసును హత్తుకునే సినిమాలు తీసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల.. మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి బడా హీరోలతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరో కూడా నటించలేదు. ఆయన సినిమాల్లో నటించిన వారందరూ కూడా బిలో యావరేజ్ నుంచి యావరేజ్ పాపులారిటీ ఉన్న నటీనటులే. అయితే శేఖర్ కమ్ముల ఇకపై స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నారని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది.

2017 వ సంవత్సరం లో వరుణ్ తేజ్ సాయి పల్లవి ని తారాగణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి తన కెరియర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. నిజానికి శేఖర్ కమ్ముల ఫిదా సినిమాని హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందించారు. అందుకే ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. అయితే ఫిదా సినిమాలో మహేష్ బాబు చేసి ఉంటే బాగుండేదని శేఖర్ కమ్ముల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రామ్ చరణ్ నటించినా ఆ సినిమా ఊహించని రీతిలో బ్లాక్బస్టర్ హిట్ అయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.


ఆయన మాటలను బట్టి చూస్తుంటే స్టార్ హీరోలతో సినిమా చేయడానికి పక్కా ప్రణాళిక వేశారు అని స్పష్టమవుతోంది. శంకర్, పరశురామ్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తున్న రాంచరణ్, మహేష్ బాబు శేఖర్ కమ్ముల సినిమా చేయడానికి ఒప్పుకుంటారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. అయితే స్టోరీ నారేట్ చేయడం తనకు అస్సలు చేతకాదని ఆయన చెప్పుకొచ్చారు. మరి తన వద్ద ఉన్న స్టోరీని అద్భుతంగా స్టార్ హీరోలకు వివరించి.. వారితో సినిమా చేసే అవకాశం లవ్ స్టోరీ డైరెక్టర్ దక్కించుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: