సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత
మహేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాట సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం..
మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రాన్ని ఈ ఏడాది
అక్టోబర్ లో
దసరా పండుగ సందర్భంగా లేదా
నవంబర్ నెలలో
దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని
మూవీ యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే.. సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. అందుకే ముందుగా అనుకున్న తేదీ ని మార్చేసి..
సినిమా రిలీజ్ ని ఫ్రీపోన్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.
మరో వైపు
మహేష్ బాబు
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి తన తదుపరి
సినిమా త్వరగా ప్రారంభించాలని కోరుకుంటున్నారు. అందుకే సమయం వృధా చేయకుండా ఈ ఏడాది జూలై నెల లోపు సర్కారు వారి పాట
సినిమా పూర్తి చేయాలని దర్శక నిర్మాతలను
మహేష్ బాబు ఒత్తిడి చేస్తున్నారట. మరి కరోనా సెకండ్ ఉధృతిలో జులై నాటికి
సినిమా చిత్రీకరణ పూర్తవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాని పరుశురాం డైరెక్ట్ చేస్తుండగా.. మైత్రి
మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ ఆచంట, గోపి చంద్ తదితరులు నిర్మిస్తున్నారు.
మహేష్ బాబు కి జంటగా
మహానటి ఫేమ్ కీర్తిసురేష్ నటిస్తుండగా.. ఎస్.ఎస్
తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో
వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే
మహేష్ బాబు కి ప్రతినాయకుడిగా తమిళనటుడు అరవిందస్వామి ని ఎంపిక చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు
కన్నడ స్టార్
ఉపేంద్ర,
తమిళ స్టార్
మాధవన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.