30 రోజుల కోసం స్టార్ హీరోకి 8 కోట్ల పారితోషికం...?

VAMSI
మాస్ మహారాజ రవితేజ... స్వయంకృషితో పట్టుదలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి హీరోగా ఎదిగాడు. ఇక అప్పటి నుండి తనదైన శైలిలో నటిస్తూ మాస్ మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఈ మధ్య కాలంలో కాస్త వెనుక పడ్డాడు. కానీ మళ్లీ క్రాక్ చిత్రంతో హిట్ పట్టాలు ఎక్కేశాడు ఈ హీరో. ఈ మూవీ ఇచ్చిన కిక్ తో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు రవితేజ. ఇప్పటికే తదుపరి ప్రాజెక్టు ఖిలాడీ సినిమాను దాదాపు పూర్తి చేసిన ఈ హీరో. ఉగాది పండుగ సందర్భంగా మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు.

కథ నచ్చాలే కానీ కొత్త దర్శకులకు కూడా పిలిచి అవకాశం ఇచ్చే హీరోలలో  రవితేజ కూడా ఒకరు. ఇప్పటికే పలువురు నూతన దర్శకులకు అవకాశం ఇచ్చిన ఆయన తాజాగా మరోసారి కొత్త డైరెక్టర్ తో పని చేయబోతున్నారు. శరత్ మండవ  అనే నూతన దర్శకుడు రవితేజను డైరెక్ట్ చేయబోతున్నాడు. 'విరాటపర్వం' ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి  ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిజ జీవిత సంఘటనలను ఆధారం చేసుకుని యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అయితే రవితేజ ఈ సినిమాను కేవలం 30 రోజుల్లోనే ఫినిష్ చేయాలని డెడ్ లైన్ పెట్టారట.

అంతే కాదు క్రాక్ సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకున్న రవితేజ ఈ సినిమాకు ఏకంగా 8 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేశాడట. అయితే ఇవన్నీ ఓకే అయ్యి ప్రస్తుతం షూటింగ్ మొదలు పెట్టే పనిలో బిజీ అయిందట చిత్రబృందం. ఈ చిత్రంలో 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా రవితేజతో ఆడిపాడనుంది. ఇదిలా ఉండగా... ఈ మాస్ హీరో తాజా చిత్రం ‘ఖిలాడి' మే 28న థియేటర్లలో విడుదల కానుంది.  ఈ సినిమా రవితేజకు మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఆకాంక్షిస్తున్నారు అభిమానుల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: