మెగాస్టార్ ట్వీట్ కి ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Purushottham Vinay
కొన్ని కొన్ని సార్లు సెలెబ్రెటీలు ట్వీట్ లు నెటిజన్స్ కి పూర్తి స్టఫ్ గా మారిపోతాయి. సెలెబ్రెటీల  ట్వీట్లతో నెటిజన్స్ కోపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఎదురైంది. ఉగాది సందర్భంగా చిత్రబృందం 'ఆచార్య'కు సంబంధించిన ఓ పోస్టర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి చిరంజీవి పోస్టర్‌ కాకుండా రామ్‌చరణ్‌ పోస్టర్‌ వచ్చింది. అందులో ఉన్న కంటెంట్‌ను చిరంజీవి ట్వీట్‌లో వర్ణించడమే ఇక్కడ టాపిక్‌. హీరోయిన్‌ పూజా హెగ్డేను హత్తుకొని రామ్‌ కళ్లలో కళ్లు పెట్టి చూస్తున్నట్లుగా ఈ పోస్టర్‌ను రూపొందించింది.భలే రొమాంటిక్‌గా ఉన్న పోస్టర్‌ను చూసి మెగా అభిమానులు చాలా ఆనందపడుతున్నారు.


సినిమాలో నక్సలైట్లు, దేవాలయాలు అంటున్నారు… రొమాన్స్‌ ఉండదేమో అని భయపడిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పోస్టర్‌ను ట్వీట్‌ చేస్తూ చిరంజీవి 'ఆయుధమైనా.. అమ్మాయైనా సిద్ధుడి చేతిలో ఒదిగిపోవాల్సిందే' అని రాసుకొచ్చారు.ఆ ట్వీటే చిరంజీవికి తలనొప్పిగా మారింది.ఈ ట్వీట్‌ను చూసి కొడుకు పోస్టర్‌ గురించి తండ్రి ఇంతలా వర్ణించాలా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరీ చాలా ఓవర్ గా వుంది అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరి అంత ఓవర్ గా వర్ణించాల మెగాస్టార్ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..ఏది ఏమైనా కాని సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువై పోయాయి. ముఖ్యంగా ట్విట్టర్ లో ఈ ట్రోలింగ్ తారా స్థాయికి వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఒక హీరో గురించి ఇంకో హీరో ఫ్యాన్స్ ట్రోల్ చెయ్యడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది.కాని పోస్టర్‌ను పోస్టర్‌గా చూడాలి తప్ప, దానికి పర్సనల్‌ లైఫ్‌ను లింక్‌ చేయకూడదనే విషయాన్ని మరచిపోయి మరీ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వార్తల గురించి తెలుసుకోండి...




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: