లీడ్ రోల్ లో కమెడియన్ సత్య... ఆహా అనిపిస్తాడా...?

VAMSI
టాలీవుడ్ లో ఎంతో మంది నటీ నటులు ఇప్పుడిప్పుడే తమ టాలెంటును నిరూపించుకునే పనిలో ఉన్నారు. నటులు అంటే తమ నటనా ప్రతిభను బయట పెట్టే వారు. ఒక నటుడు హీరోగా చేయగలడు, విలన్ గా చేయగలడు, మరేదైనా ప్రత్యేక పాత్రలలో కూడా చేసి మెప్పించగలడు. అది నటుల యొక్క టాలెంట్. ఇలా సినిమాలలో క్యారెక్టర్ ఏదైనా ప్రతి ఒక్క నటుడి రోల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే. ఇప్పటికే ఎంతో మంది కమెడియన్లు కేవలం కామెడీ పాత్రలకు మాత్రమే అంకితం కాకుండా..పలు సినిమాల్లో హీరోలుగా, విలన్ లుగా,గెస్ట్ రోల్స్ లోనూ తమదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.

అంతేకాదు ఒక నటుడు ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలడు అన్న విషయాన్ని తెలియజేశారు.  సునీల్, సప్తగిరి, షకలక శంకర్..ఇలా ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా ఛాన్సులు అందుకొని తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ లీడ్ రోల్ కు ఎంపికయ్యారు. అంటే హీరో రేంజ్ లో అని చెప్పలేం కానీ...లీడ్ రోలే. ఇంతకీ అతనెవరంటే...టాలీవుడ్ లో టాలెంటెడ్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సత్య... తన కామిక్ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి వారి అభిమానాన్ని అందుకున్నాడు. అయితే తాజా సమాచారం ఒరకరం సత్య ఓ  వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సిరీస్ లో సత్య లీడ్ రోల్ లో కనిపించనున్నట్టు టాక్ నడుస్తోంది.

తెలుగులో మనకు ఉన్న ఏకైక ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’.. ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరి ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక సక్సెస్ అయితే సత్యకు వెండి తెరపై కూడా హీరో గా అవకాశాలు దక్కే చాన్స్ లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. తన పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కమెడియన్ హీరో గా చాన్స్ కొట్టేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: