వకీల్ సాబ్ లో కనబడే హీరో పవన్ అయితే కనపడని హీరో అతనేనటా...!

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన టాలీవుడ్ సినీ పరిశ్రమకి ఆరడుగుల బుల్లెట్ లాంటివాడు. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు.ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇక పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో దాదాపు మూడు సంవత్సరాల తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అనన్య నాగళ్ల, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషించగా, శృతి హాసన్ కథానాయికగా నటించింది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.కరోనా వలన పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయిన పవర్ స్టార్ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.ఇక సినిమా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..


ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని అందరికి తెలిసిందే.ఆయన సినిమాలో ఉంటే జనాలు ఆయన్ను తప్ప ఎవరిని పట్టించుకోరు. ఇక ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడంలో మరో కనపడని హీరో హస్తం కూడా వుంది. అతనెవరో కాదు మ్యూజిక్ డైరెక్టర్ యస్ యస్ తమన్ అనే చెప్పాలి. యస్ యస్ తమన్ అందించిన బ్యాక్ మ్యూజిక్ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉతకంఠకి గురి చేసిందనే చెప్పాలి. తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి పెద్ద హైలైట్ గా నిలిచింది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: