ఆడవారి గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం వకీల్ సాబ్...?

VAMSI
ప్రజలకు దగ్గరవడం కోసం మూడేళ్ళ పాటు సినిమాలకు దూరమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అభిమానుల ఆకాంక్ష మేరకు తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఈ స్టార్ హీరో కి ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న ఈ హీరోకి ఎప్పటికీ స్టార్ డం ఏ మాత్రం తగ్గదు. మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కు నీరాజ నాలు పలికారు ప్రేక్షకులు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై ముందునుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పొలిటికల్ ఎంట్రీ తర్వాత సినీరంగంలోకి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తుండడం..అందులోనూ ఇది బాలీవుడ్ లో ఘన విజయం అందుకున్న పింక్ చిత్రానికి రీమేక్ కావడం తో ఈ సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మగువ మగువ అనే సాంగ్ ఈ సినిమా క్రేజ్ ని తారా స్థాయికి  చేర్చింది. మహిళల గొప్పతనానికి వారి వ్యక్తిత్వానికి అడ్డం పట్టిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఇన్ని భారీ అంచనాల మధ్య నేడు తెలుగు రాష్ట్రాల్లో  ఎంతో ఘనంగా విడుదలైన ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమా రివ్యూ అందించిన కొన్ని మీడియాలు ఇది ఖచ్చితంగా 100 కోట్ల సినిమా అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే సినిమా చూసిన ఆడియన్స్ సైతం సినిమా సూపర్ హిట్ అని...మంచి గ్రిప్ ఉన్న స్టోరీ తో పవన్ అదరగొట్టారని చెబుతున్నారు.

ఇక పవన్ లాయర్ గెటప్ లో చాలా ప్రొఫెషనల్ కనిపించారని...తమ అంచనాలకు మించి సినిమా ఉందని అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ చిత్రం హిట్ టాక్ తో దూసుకు పోతోంది. ఈ మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ కథను ప్రెజెంట్ చేసిన విధానం అద్భుతం అంటూ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మహిళకు ఈ సినిమా అంకితం అని చెప్పవచు. మహిళల గొప్ప తనాన్ని అత్యద్భుతంగా చూపించిన తీరు హర్షణీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: