వకీల్ సాబ్ లో నాగ్ నటించారా..ఎక్కడంటే?

Satvika
జనసేనాని హీరో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా ' వకీల్ సాబ్ '.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నిన్న రాత్రే యూఎస్‌లో 'వకీల్ సాబ్‌' ప్రీమియర్ షోస్ పడ్డాయి. అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా 'వకీల్ సాబ్‌' సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. యూఎస్ పబ్లిక్ టాక్ పాజిటివ్‌గా వస్తోంది. మూడేళ్ళ తర్వాత రీ 'వకీల్ సాబ్‌' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అందరి ఆకలి, కరువు తీర్చేశాడని చెప్పుకుంటున్నారు. నెల రోజుల నుంచి 'వకీల్ సాబ్‌' చిత్ర బృందం ప్రమోషన్స్‌తో హోరెత్తించిన సంగతి తెలిసిందే. సినిమా మీద భారీగా అంచనాలు పెంచడంలో చిత్ర బృందం సక్సస్ అయ్యారు.


కేవలం పవన్ అభిమానుల్లోనే కాకుండా ప్రతీ ప్రేక్షకుడికి 'వకీల్ సాబ్‌' సినిమాని మొదటిరోజు మొదటి ఆట చూడాలని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్లుగానే మొదటి షో తో భారీ హిట్ పడిందనే టాక్ వినిపిస్తుంది. యూత్ లో పవన్ లు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ఈ రేంజు లో టాక్ ను అందించింది..వకీల్ సాబ్‌' బెఫిట్ షోస్‌లో నానా హంగామా చేశారు. ముఖ్యంగా 'వకీల్ సాబ్‌' నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ అభిమానిగా థియేటర్‌లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిర్మాతన్న విషయం కూడా మర్చిపోయి పవన్ స్క్రీన్ మీద కనిపించగానే పేపర్లు ఎగరవేసి నానా రచ్చ చేశాడట..


ఇకపోతే తాజాగా ఈ చిత్ర దర్శకుడు షాక్ ఇచ్చాడు. ఆసక్తికరమైన విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరాం బయట పెట్టాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన 'పింక్' సినిమానే తెలుగులో పవర్ స్టార్‌తో 'వకీల్ సాబ్‌'గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఒకవేళ 'వకీల్ సాబ్‌' గనక పవన్ కళ్యాణ్ నో అంటే మాత్రం ఈ సినిమాకి నెక్స్ట్ ఆప్షన్‌గా టాలీవుడ్ మన్మధుడు..కింగ్ నాగార్జునని వేణు శ్రీరాం అనుకున్నట్టుగా తెలిపాడు. అంటే పవర్ స్టార్ నో అంటే అప్పుడు 'వకీల్ సాబ్‌'లో నాగార్జున టైటిల్ రోల్ చేసుండేవారన్నమాట.. కానీ బయట ఈ వార్త మాత్రం వివిధ రకాలుగా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: