మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ తో అభిమానుల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ తన అద్భుతమైన నటన తో ప్రశంసలు అందుకుంటున్నారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ చిత్రం ఓ మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చిందనే టాక్ వినపడుతోంది. బీభత్సమైన కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు పవన్ కల్యాణ్ అదిరిపోయే పర్ఫామెన్స్ సినిమాకి ఆయువుపట్టు కాగా.. థమన్ మ్యూజిక్ మరో హైలైట్. వకీల్ సాబ్ లో ఒరిజినల్ సినిమా కి మించి ఉన్న అద్భుతమైన కంటెంట్ కోసం అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల నుంచి కనీ వినీ ఎరుగని పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఈ రోజే విడుదల కాగా.. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలివస్తున్నారు. ఆల్రెడీ భారీ హిట్ టాక్ వచ్చింది కాబట్టి కొద్దిరోజుల సమయంలోనే ఈ సినిమా 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుందని ప్రముఖ సినీ పండితులు చెబుతున్నారు. వకీల్ సాబ్ చిత్రం ఓవర్సీస్ లో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం రోజు ఉదయం 10 గంటల లోపు ఆస్ట్రేలియాలో 70 లక్షలు, న్యూజిలాండ్ దేశంలో 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో 160 ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం ఒకటిన్నర కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. కరోనా సమయం లోనూ ఈ స్థాయిలో వసూళ్లను కలెక్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే.
ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ హిట్టు అందుకోవడంతో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అజ్ఞాతవాసి డిజాస్టర్ తో తీవ్ర నిరాశలో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఆకలి ఈ మూవీ హిట్ తో తీరి పోయిందనే చెప్పాలి.