సూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే అస్సలు వద్దంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ .. ఎందుకంటే...?
ఇక సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహర్షి సినిమాతో మహేష్ పూజా హెగ్డే జోడీ సూపర్ హిట్ జోడీ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది.అయితే మహేష్ అభిమానులు మాత్రం మాకు పూజా అస్సలు వద్దు బాబోయ్ అంటున్నారు.ఎందుకంటే పూజా మహేష్ కి అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని మహేష్ అభిమానులు కోప్పడుతున్నారు. పలు ఈవెంట్లలో కూడా పూజా వేరే హీరోల గురించి గొప్పగా మాట్లాడింది కాని మహేష్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనేది వారి వారి వాదన. సూపర్ స్టార్ మహేష్ కోసం శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే, కృతి సనన్, అలియా భట్ వంటి పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోయిన్లే నటించాలని అనుకుంటుండగా ఏ హీరోయిన్ దొరకనట్టు ఈ పూజా హెగ్డే నే ఎందుకు తీసుకోవాలి అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఏ హీరోయిన్ ని కన్ఫామ్ చేస్తాడో చూడాలి...