అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల...ఈ సారి హిట్ పక్కా...?
ఈ సినిమా టైటిల్ సరికొత్తగా "ఏజెంట్" అని పెట్టారు. ఈ టైటిల్ కి తగ్గట్టుగానే అఖిల్ ఈ సినిమాలో గూఢచారిగా ప్రేక్షకులను మెప్పించనున్నాడు. ఇది ఒక స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ లా ఉంది. సురేందర్ రెడ్డి ఇలాంటి సినిమాలను డీల్ చేయడంలో సిద్ధహస్తుడు. ఇప్పటికే కిక్ మరియు రేసుగుర్రం లాంటి సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయింది. ఈ ఫస్ట్ లుక్ లో అఖిల్ ఒక కొత్త మేకోవర్ ట్రై చేశాడని తెలుస్తోంది. అంతే కాకుండా ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఫిజికల్ గా ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఏజెంట్ గా ఎలా ఉండాలో అలా...తన లుక్ ఉంది. రఫ్ పేస్ తో సిగరెట్ తాగుతూ ఏజెంట్ లా ఉన్నాడు. ఈ సినిమా ఆధ్యంతం స్పై థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతోంది.
సురేందర్ రెడ్డి గత సంవత్సరం మెగాస్టార్ తో తీసిన సైరా నరసింహారెడ్డి తో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం ఒక కొత్త కాన్సెప్ట్ ని ఎంచుకుని అఖిల్ కి మంచి హిట్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించడం విశేషం. ఈరోజు అఖిల్ పుట్టినరోజు కావడం వలన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ మరోసారి సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సంగీతాన్ని అందించనున్నారు. మరి ఈ సినిమా అయినా అఖిల్ కెరీర్ ను మలుపు తిప్పే చిత్రం అవుతుందా చూడాలి.