ఈ హీరోయిన్ మరో సాయి పల్లవి అవుతుందా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓవర్నైట్ లోనే స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అందులో ఒకరు సాయిపల్లవి.తెలుగమ్మాయి కాకపోయినా తెలుగులో ఒకేఒక్క సినిమాతో ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు సాయిపల్లవి. ఫిదా సినిమా తో గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను నిజంగానే ఫిదా చేసిందని చెప్పవచ్చు. గ్లామర్ షో కి దూరంగా ఉండే సాయి పల్లవి తన సినీ కెరీర్లో మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సాయిపల్లవి ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫిదా తర్వాత సాయి పల్లవి కెరీర్లో ఎన్నో విషయాలు ఉన్నా ఫిదా రేంజ్ అంత సక్సెస్ మాత్రం లేదు అని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా తీయబోయే లవ్ స్టొరీ సినిమాతో సాయిపల్లవి కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా లవ్ స్టోరీ సినిమా తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల వైష్ణవ్ తేజ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంట గా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో పెద్దగా ప్రచారం జరుగుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా, కమర్షియల్గా ఈ సినిమాలు సక్సెస్ కాలేదు.
అయితే ప్రియాంక శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలో నటిస్తే మాత్రం ఆమె జాతకం కచ్చితంగా మారుతుందని, ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం అని చెప్పవచ్చు. ఇక ఈమె కూడా మరో సాయి పల్లవి అయ్యే అవకాశం ఉందని కూడా విశ్వసనీయవర్గాల సమాచారం . ఇదిలా ఉండగా సారంగదరియా పాట వల్ల లవ్ స్టోరీ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.అంతే కాకుండా లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బాస్టర్ అని శేఖర్ కమ్ముల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.