పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే..!
ఇక సమంత, శర్వానంద్ జంటగా 96 లాంటి క్లాసిక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది జాను. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా జాను డిజాస్టర్ అయింది. సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా మూడేళ్ల కింద వచ్చిన సినిమా మళ్లీ రావా. జీవితంలో ఉన్న మూడు లేయర్స్‌లో ఉన్న ప్రేమను ఆవిష్కరించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అయితే మళ్లీ రావా మంచి టాక్ తెచ్చుకుని కూడా ఫ్లాప్ అయింది.
రామ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా జగడం. 2007లో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. అయితే మరీ సినిమా అగ్రెసివ్‌గా ఉండటంతో జగడం సినిమాను ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. రవితేజ కెరీర్‌లో అద్భుతమైన సినిమాల్లో ఒకటి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్. నిజంగానే సినిమా కూడా అలాగే ఉంటుంది. కానీ సినిమా మాత్రం కమర్షియల్‌గా అస్సలు వర్కవుట్ కాలేదు.
కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయాలనుకోవడం మంచిదే కానీ మరీ కొత్తదనం ఎక్కువైపోతే మాత్రం అప్పుడప్పుడూ నాని లాంటి సినిమాలు వస్తాయి. సినిమా చూడ్డానికి చాలా కొత్తగా అనిపిస్తుంది కానీ ఫలితం మాత్రం చాలా దారుణంగా వచ్చింది. మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా నిలిపిన చిత్రం ఇది. కానీ ఒక్కడు సినిమా విడుదలై సంచలన విజయం సాధించడం మహేష్‌కు స్టార్ ఇమేజ్ రావడంతో నిజం సినిమా తేలిపోయింది. కానీ ఇప్పటికీ నిజం తన కెరీర్లో మంచి సినిమా అంటాడు సూపర్ స్టార్.