ఎవరో అనామకులు చెబితే నేను వినను.. రానా షోలో నాగార్జున..?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న దగ్గుబాటి వారసుడు రానా కేవలం సినిమాల్లో హీరోగా మాత్రమే కాదు వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు రానా. ఇదే సమయంలో అటు నెంబర్ 1 యారి అనే ఒక టాక్ చేస్తూ అందరినీ  ఆకర్షిస్తున్నాడు. ఇక ఈ షోలో భాగంగా సినీ సెలబ్రిటీలు అందరిని కూడా గెస్ట్ లు గా పిలుస్తూ తనదైన శైలిలో ప్రశ్నలడుగుతూ ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు దగ్గుపాటి రానా.


 అయితే ఇటీవలే నెంబర్ వన్ యారి అనే టాక్ షో కి సంబంధించి ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇక నాగార్జునను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగిన రానా..  ప్రేక్షకులకు తెలియని విషయాలను కూడా తెలియజేశారు.  ఈ క్రమంలోనే సోషల్ మీడియా గురించి నాగార్జున ను ప్రశ్నించగా నాగార్జున సోషల్ మీడియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 ఒకప్పుడు తనకు సోషల్ మీడియా లో ఒక యాప్ కొత్తగా వచ్చిన సమయంలో తన ఐడి క్రియేట్ చేసుకున్నానని ఇక ఆ తర్వాత ఎన్నో నోటిఫికేషన్స్ వచ్చాయని ఆ నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యపోయాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. మనం రోజు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎక్కడ పడుకోవాలి ఎప్పుడు లేవాలి అనే విషయాన్ని సోషల్ మీడియాలో నే మనకు తెలియని వాళ్ళు మనకి చెబుతూ ఉంటారని.. అయితే ఎవరో అనామకుడు మొఖం కూడా తెలియని వాడు చెబితే వినాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి వెంటనే ఇక సోషల్ మీడియాలో నోటిఫికేషన్స్ ఆఫ్ చేశా అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: