ప్రియుడితో ఫుల్ రొమాన్స్ లో మునిగిన నయన్.. !
.గతంలో రెండు మూడు బ్రేకప్‌ల నుంచి బయటపడిన నయనతార కొద్ది సంవత్సరాలుగా విఘ్నేష్ శివన్‌తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే వారిద్దరూ అధికారికంగా తమ బంధాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి వారిద్దరు ఓ సందర్బం చిక్కితే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆ ఫీలింగ్స్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంటున్నారు.లాక్‌డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన నయనతార, విఘ్నేష్ శివన్ ఓనమ్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు.
ఇప్పుడు తాజాగా ఈస్టర్ పండుగ సందర్భంగా పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు. ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ కౌగిలింతలతో చిలిపిగా కనిపించారు. వారిద్దరు దిగిన ఫోటోను నయనతార సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో కాస్త వైరల్ అయింది. ఈస్టర్ డే.. నా జీవితంలో సంతోషకరమైన దినం అంటూ కామెంట్ చేశారు..మరి ఈ ప్రేమ బంధం అయినాగానీ పెళ్లి బంధంగా మూడుపడుతుందో లేదో చూడాలి.. !నయనతార కెరీర్ విషయానికి వస్తే మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందే నెట్రికన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తునన చిత్రం కథువాకుల రెండు కాదల్ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంతతో కలిసి నటిస్తున్నారు.