నెటిజన్ కు ఫోన్ నెంబర్ ఇచ్చిన రాజ్ తరుణ్.. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..?

praveen
ఒకప్పుడైతే సినీ అభిమానులు అందరూ కూడా తమ అభిమాన హీరో ల తో మాట్లాడటం అనేది కేవలం కలలో మాత్రమే సాధ్యం అయ్యేది కానీ నేటి రోజుల్లో మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని అభిమానులకు అది ఎంతో సులభం గా మారిపోయింది. ఇక సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోలు సైతం తన అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చటిస్తూ ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు ఇక తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతూ ఉంటారు స్టార్ హీరోలు.  స్టార్ హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉండటం లాంటివి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం.



 కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా అభిమానులతో ఈ మధ్యకాలంలో చిట్ చాట్ చేస్తున్నారు.  ఇకపోతే ఇటీవల యువ హీరో రాజ్ తరుణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. సాధారణంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూన్న తరుణంలో అభిమానులు కొన్ని వింత అయిన ప్రశ్నలు అడుగుతూ ఉండడం చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో యువ హీరో రాజ్ తరుణ్ అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న సమయంలో ఇక ఒక నెటిజన్ మీ నెంబర్ ఇవ్వండి బ్రో అంటూ అడుగుతాడు.  దీంతో రాజ్ తరుణ్ వెంటనే తన నెంబర్ ఇచ్చేస్తాడు.



 దీంతో నెటిజన్లు అందరూ కూడా షాక్ అవుతారు.  ఇక ఆ తర్వాత కాసేపటికి మీరు ఇచ్చిన నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది బ్రో అంటూ రాజ్ తరుణ్ కి రిప్లై ఇస్తాడు నేటిజన్.  అయితే అది నా నెంబరు కాదు బ్రో నాగార్జున హీరోగా నటించిన మాస్ సినిమా లోని శివమణి నెంబర్ అంటూ చెప్పి అసలు ట్విస్ట్ ఇస్తాడు రాజ్ తరుణ్. దీంతో నెటిజన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇలా కేవలం సినిమాల్లోనే కాదు అటు సోషల్ మీడియాలో కూడా రాజ్ తరుణ్  ఎంతో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో సరదా సరదాగా ముచ్చటిస్తూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: