ముందేమో ఊపింది, ఇప్పుడేమో మెల్లగా ఊపు తగ్గింది ... ఇది ఊహించలేదు సుమీ ...??

GVK Writings
యూత్ స్టార్ నితిన్ హీరోగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా రంగ్ దే. తొలిసారిగా నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఎంతో గ్రాండ్ ల్వేల్లో నిర్మించారు. రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి పీసీ శ్రీరామ్ ఫోటోగ్రఫీ అందించగా నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేశారు.

ఇక గత నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. మంచి రొమాంటిక్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ మరియు కీర్తి సురేష్ జోడీకి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా సినిమాలో లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయని  కొందరు ప్రేక్షకులు సినిమా పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తొలి రోజు తొలి ఆట తర్వాత నుంచి మంచి టాక్ తో పాటు బాగానే కలెక్షన్లు రాబట్టే సినిమా ఇటీవల రెండవ వారంలోకి ప్రవేశించిన తర్వాత మెల్ల మెల్లగా కలెక్షన్లు తగ్గుముఖం పట్టిందని కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు కలెక్షన్స్ చాలావరకు డ్రాప్ అయ్యాయని సమాచారం.

నిజానికి ఇప్పటివరకూ పరవాలేదనిపించేలా కలెక్షన్ రాబట్టి ఈ సినిమాకి నిన్న రిలీజ్ అయిన సుల్తాన్, వైల్డ్ డాగ్ సినిమాలు రెండూ కూడా కొంతవరకు దెబ్బ వేసాయి అని చెప్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు రూ.16 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిందని అలానే బిజినెస్ పరంగా చూస్తే ఈ సినిమా మరో రూ.8 కోట్ల వరకు రాబట్టాల్సి ఉందని అంటున్నారు. మరి రాబోయే పరిస్థితుల్లో ఈ సినిమా ఇంక ఎంతమేర రాబడుతుందో, బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వరకు వెయిట్ చేయక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: