టెంపర్ సినిమా రైటర్‌తో నితిన్ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడా
రంగ్ దే సినిమా సక్సెస్ అయిన తరుణంలో నితిన్ తన తర్వాతి సినిమా మాస్ట్రోతో ముందుకు రానున్నారు. నితిన్ తన పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. హిందీలో సూపర్ హిట్ అయిన అందాదున్ సినిమా రీమేక్‌గా మాస్ట్రో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. తాజాగా విడుదలైన మాస్ట్రో ఫస్ట్ లుక్ పోస్టర్లో నితిన్ చేతిలో స్టిక్ పట్టుకుని నడుస్తున్నాడు. అంటే ఈ సినిమాలో హీరోకి కళ్లు కనబడవు. నితిన్ వెనకాల ఉన్న పియానోపై రక్తపు మరకలు కనిపిస్తాయి. పోస్టర్ చూస్తే ఆ రక్తపు మరకలు ఎవరివి.. ఎవరిని హత్య చేసి ఉంటాడనే అనుమానం కలిగిస్తాయి. ఇలాంటి పాత్ర నితిన్ కెరీర్లో ఎప్పుడూ నటించలేదు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. మాస్ట్రో సినిమాను దర్శకుడు మెర్లపాక గాంధీ చిత్రీకరిస్తున్నారు.
అయితే మాస్ట్రో సినిమా అనంతరం హీరో నితిన్ మరో రెండు సినిమా కథలను వెయింటింగ్ లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం. కిక్, టెంపర్ వంటి సినిమాలకు కథలని అందించిన వక్కంతం వంశీ రాసిన కథ కూడా ఇందులో ఉందని తెలుస్తోంది. వంశీ అనేక రకాల కథలతో హీరోల చుట్టూ తిరిగిన తర్వాత ఎట్టకేలకు నితిన్‌కు కథ చెప్పినట్లు సమాచారం. దీనికి నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం.