ఇదే నా లాస్ట్ సినిమా అని బాంబు పేల్చిన నాని మూవీ డైరెక్టర్..

Suma Kallamadi
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ పొందింది. ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ విడుదల కానున్నది. ఏప్రిల్ 18వ తేదీన హైదరాబాద్ నగరంలో టక్ జగదీశ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించనున్నారు. అలాగే మరి కొన్ని ప్రచార కార్యక్రమాలకు దర్శకనిర్మాతలు శ్రీకారం చుట్టనున్నారు.


అయితే ఇటీవల ప్రెస్ మీట్ లో పాల్గొన్న డైరెక్టర్ శివ నిర్వాణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అదేంటంటే టక్ జగదీష్ సినిమా తన కెరీర్ లో చివరి ఫ్యామిలీ డ్రామా మూవీ కాబోతుందని ఆయన బాంబ్ పేల్చారు. 2017 లో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించింది. 2019లో ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో ఫ్యామిలీ డ్రామా మజిలీ కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే తన మొదటి రెండు సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అని , ఇప్పుడు నాని తో తీసిన సినిమా కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరే అని.. కానీ ఇకపై తాను ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అసలు చేయనని.. డిఫరెంట్ జోనర్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతానని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు. తన చివరి ఫ్యామిలీ డ్రామా అయిన టక్ జగదీష్ మంచి హిట్ కావాలని ఈ సందర్భంగా ఆయన ఆశించారు.


ఇదే సందర్భంగా మాట్లాడిన హీరో నాని పరిచయ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలను ఎవరు కూడా అపార్థం చేసుకోకండి అని విజ్ఞప్తి చేశారు. "నా అభిమానులను సొంతం ఫ్యామిలీ లాగా నేను భావిస్తాను. ఇతర హీరోల యొక్క అభిమానులతో నా ఫ్యాన్స్ గొడవ పెట్టుకోకూడదని నేను ఎప్పుడూ కోరుకుంటాను" అని ఆయన అన్నారు. అయితే టక్ జగదీష్ సినిమాలో తాను సరికొత్తగా కనిపించనున్నానని.. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: