అదరగొడుతున్న ఆచార్య ప్రోమో సాంగ్....

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి సుధీర్ఘ రాజకీయ జీవితం తరువాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన సుపుత్రుడు రామ్ చరణ్ నిర్మాణంలో క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ఇప్పటి వరకు ఆచార్య అంటే ఏదో సీరియస్ సినిమా అని.. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది కాబట్టి డాన్సులు ఉండవని అంతా అనుకున్నారు. టీజర్‌లో.. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌లో కూడా ఎక్కడా చిరంజీవి డాన్సులు చేసినట్లు కనిపించలేదు. దాంతో ఇందులో చిరు డాన్సులు మిస్ అయిపోతామేమో అనే టెన్షన్ అభిమానుల్లో కూడా ఉండేది.అయితే ఒక్క టీజర్‌తోనే అన్నింటికి సమాధానాలు ఇచ్చేసాడు దర్శకుడు కొరటాల శివ.


ఇందులో నుంచి తొలి పాటను మార్చ్ 31 సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. లాహే లాహే అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను ఒక్కరోజు ముందుగానే రిలీజ్ చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దేవీ కాకుండా తొలిసారి మరో సంగీత దర్శకుడితో పని చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. దీనికి న్యాయం చేస్తాడనే నమ్ముతున్నారు అభిమానులు కూడా. టీజర్‌లో అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మణిశర్మ.. ఇప్పుడు తొలిపాటకు కూడా ఊపిచ్చే ట్యూన్ ఇచ్చుంటాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. పైగా ఈ స్టిల్ చూసిన తర్వాత  మెగా అభిమానుల్లో జోష్ మాములుగా లేదు.ఇక మెగాస్టార్ అంటేనే డాన్స్ ఇరగదీస్తాడు అనే విషయం అందరికి తెలుసు. ఖచ్చితంగా ఈ సినిమాలో మెగాస్టార్ స్టెప్స్ అభిమానులని అలరించడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక చూడాలి ఈ సినిమాలోని చిరంజీవి డాన్స్ స్టెప్పులు అభిమానులని ఏ విధంగా ఆకట్టుకుంటాయో అని..ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: