రాకేష్ మాస్టర్ ని కూడా వదలలేదు.. చీరలో ఎలా ఉన్నాడో చుడండి..?

praveen
గత ఏడాది బాగా ఫేమస్ అయింది ఏంటి అంటే అందరూ చెప్పే పేరు కరోనా వైరస్..  కరోనా వైరస్ కాదు జనాలలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు రాకేష్ మాస్టర్. ఒకప్పుడు ఢీ షో ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ ఇక ఆ తర్వాత వెండితెరపై కాస్త కనుమరుగయ్యారు. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా రాకేష్ మాస్టర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ఒక సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాకేష్ మాస్టర్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియా ఓపెన్ చేసి ఎక్కడ చూసినా కూడా రాకేష్ మాస్టర్ కనిపించారు. ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ తీసుకోవడం ఒక చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడగడం వాళ్లు అడిగిన ప్రశ్నలకు రాకేష్ మాస్టర్ సంచలన  సమాధానాలు చెప్పడం లాంటివి జరిగాయి. అయితే ఇక 2021 సంవత్సరంలో మాత్రం తాను పూర్తిగా మారిపోయాను అంటూ రాకేష్ మాస్టర్ ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో లో ఎంట్రీ ఇచ్చాడు.



 ఇక జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తనదైన శైలిలో కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు.చలాకి చంటి టీమ్ లో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాకేష్ మాస్టర్  ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో చేస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా రాకేష్ మాస్టర్ చేస్తున్న పర్ఫామెన్స్ బాగా వర్కవుట్ అవుతుంది. ఇటీవలే బుల్లెట్ భాస్కర్ ఏకంగా రాకేష్ మాస్టర్ పైన స్కిట్ చేసాడు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ చీరకట్టుకుని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చీర కట్టుకొని వచ్చి తనదైన శైలిలో కామెడీ పండించాడు రాకేష్ మాస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: