
ప్రతిరోజు సాయంత్రం 7 గంటలు అయితే చాలు పిల్లలతో ఆ విషయం పై గొడవ : రేణూ దేశాయ్..
రేణూ దేశాయ్ గురించి సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె కేవలం నటి మాత్రమే కాదు మోడల్ అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. రేణూ దేశాయ్ 2000వ సంవత్సరంలో జేమ్స్ పాండు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 2003వ సంవత్సరంలో బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కొంతకాలం సహజీవనం కూడా చేశారు. అయితే వీరిద్దరి గురించి రూమర్లు చక్కర్లు కొడుతూ ఉండడం తో, ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలో నటించింది. తర్వాత కొద్ది రోజులకు వీరిద్దరికీ పెళ్లి కాకముందే అకీరా నందన్ పుట్టాడు. ఇక అకీరానందన్ సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరికి ఆద్య అనే పాప కూడా పుట్టింది..
ఇదిలా ఉండగా మీడియా ముందుకు రేర్ గా వచ్చే రేణూదేశాయ్, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. అయితే తాజాగా ధర్మం హిందూ, ధర్మం, దేశంలోని పరిస్థితులు, సెక్యులరిజం గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది.. రేణుదేశాయ్ మాట్లాడుతూ.." హిందూ ధర్మం, ధర్మం అంటే మనిషి నమ్మకం. మనం ఎలా జీవించాలి.. మనం ఎలా ఉంటున్నాం.. ఏమి నమ్ముతున్నాం.. ఏం చేస్తున్నాం అనేది ధర్మం. తల్లిగా మనకంటూ ఒక ధర్మం ఉంటుంది. ఇంటిని చూసుకోవాలి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని బాధ్యతగా పెంచాలి. ఇవే నా ధర్మాలు అంటూ ఆమె చెప్పుకొచ్చింది..
అంతే కాకుండా ఇటీవల తన పిల్లలపై గురించి స్పందిస్తూ.. ప్రతిరోజు సాయంత్రం 7:00 అయితే చాలు, ప్రతి రోజు నా పిల్ల తో గొడవ అవుతుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. అదేమిటంటే.. ప్రతిరోజు సాయంత్రం 7:00 అయితే చాలు నా పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నా
సరే వచ్చి, స్నానం చేసి హారతి తీసుకొని,దేవుడికి దండం పెట్టాలి. ఇది ఖచ్చితంగా, విధిగా జరగాల్సిన పని. దాంట్లో నేను కాంప్రమైజ్ అస్సలు అవ్వను. మొన్న ఈ మధ్య కాలంలోనే నాకు, నా పిల్లలకు గొడవ అయింది. పిల్లలిద్దరూ.." అందరు పిల్లలు ఆడుకుంటున్నారు.. నువ్వు మాత్రం ఇలా చేస్తావ్.. ఇలా ఉంటావు.. అని నన్ను ప్రశ్నించారు.. రోజు మొత్తంలో 24 గంటలు ఉంటే,నేను కేవలం రెండు నిమిషాలు మాత్రమే మిమ్మల్ని దేవుడిని ప్రార్థించమని అడుగుతున్నాను కదా..! అని అన్నాను. దాంతో పిల్లలు కూడా సరే అన్నారు.. అలా ప్రతి రోజు ఏడు గంటలకు పూజ, 7:30 గంటలకు డిన్నర్ చేస్తామంటూ రేణుదేశాయ్" చెప్పుకొచ్చింది..