బయటపడుతున్న రాజశేఖర్ మర్మాణువు రహస్యం !
దీనితో అనేక ఆలోచనలు చేసి రాజశేఖర్ తన కూతుళ్ళను నిర్మాతలుగా మార్చి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో లేటెస్ట్ గా మొదలుపెట్టిన మూవీకి ‘మర్మాణువు' అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 'మర్మాణువు' అంటే రహస్య ప్రదేశం అన్న అర్థం వస్తోంది.
అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను చూసిన వారికి ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్న అర్థం వస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ కథ జమీందారి కాలంనాటి కథ అని అనుకుంటున్నారు. జమీందారు ఆయన వారసత్వ సంపదకు సంబంధించిన నిధి అన్వేషణగా ఈ మూవీ కథ ఉంటుందని లీకులు వస్తున్నాయి. గతంలో గోపీచంద్ ఇలాంటి కథతో నటించిన ‘సాహసం’ మూవీ అప్పట్లో హిట్. ఈ తరహా జోనర్లో రాజశేఖర్ చేస్తున్న తొలి సినిమా దీనిని పరిగణించాలి.
ప్రస్తుత తరం ప్రేక్షకులు కోరుకునే అనేక ట్విస్టులు ఈ మూవీలో ఉండే విధంగా దర్శకుడు వెంకటేష్ మహా ఈ మూవీ స్క్రీన్ ప్లేను డిజైన్ చేసినట్లు టాక్. ఈ తరహా సినిమా కథలు ఈమధ్య ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈమధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచిలో చాల మార్పు రావడంతో హీరోలు చెప్పే భారీ డైలాగులు భారీ సెట్లు చూడటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. కథలో ఎక్కువ మలుపులను కోరుకుంటున్నారు. ఇప్పటి తరం అభిరుచులు బాగా తెలిసిన రాజశేఖర్ కూతుళ్ళు నిర్మాతలుగా అయినా సక్సస్ అవ్వగలిగితే రాజశేఖర్ కు ఆనందం దక్కుతుంది. మరి ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది వేచి చూడాలి..