వామ్మో .... ఏకంగా ఒకే రోజున వస్తున్న ఆ ఇద్దరు సింహాలు ... రచ్చ రచ్చే అయితే ....??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నతాజా సినిమాలైన సర్కారు వారి పాట, హరిహర వీరమల్లు రెండూ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ దాని అనంతరం సర్కారు వారి పాట సినిమా మొదలుపెట్టారు. నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా మధ్యలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వలన కొన్ని నెలలపాటు సెట్స్ మీదకు వెళ్లే కుండా ఆగిపోయింది.

ఎట్టకేలకు కొన్నాళ్ల క్రితం ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా తొలి షెడ్యూల్ దుబాయ్ లో నిర్వహించారు. తదుపరి షెడ్యూల్ గోవాలో నిర్వహించనున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకుడు. 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఈ సినిమా ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అవుతోంది. మరోవైపు ఇటీవల వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామా మూవీ హరిహర వీరమల్లు లో నటిస్తున్నారు. ఇందులో వజ్రాల దొంగ వీరమల్లు పాత్రలో పవర్ యాక్షన్ అద్భుతంగా ఉంటుందని అలానే ఆయన పలికే డైలాగ్స్ కూడా ఎంతో ఆకట్టుకుంటాయని అంటున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా జ్ఞాన శేఖర్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి అయితే రిలీజ్  కానున్నాయని విషయం తెలిసినప్పటికీ పక్కాగా ఏది ఏ రోజు రిలీజ్ అవుతుంది అనేదానిపై మొన్నటి వరకు ఎవరు లోనూ ఎటువంటి క్లారిటీ లేదు. ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా 2022 సంక్రాంతి రోజున అనగా జనవరి 14న థియేటర్స్ లోకి రానున్నాయని అంటున్నారు. మరోవైపు ఇద్దరు సినిమాల నిర్మాతలు కూడా ఆరోజు అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావించి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. మరి ఇదే గనుక నిజమైతే తొలిసారిగా అటు సూపర్ స్టార్, ఇటు పవర్ స్టార్ ఇద్దరి మధ్య భారీ బాక్సాఫీస్ క్లాష్ తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: