మెగాస్టార్ తో బాబీ తీయబోయేది అలాంటి మూవీనా .....??
మరోవైపు కొన్నాళ్ళ క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య అనే మాజీ నక్సలైట్ పాత్ర పోషిస్తుండగా ఆయన అనుచరుడైన కామ్రేడ్ సిద్ద పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ ఈ ఏడాది మే 28న రిలీజ్ కానుంది. అయితే దీని తర్వాత లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
ఇక దీని తర్వాత బాబి దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ మూవీ పోలీస్ స్టోరీగా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని అంటున్నారు. గతంలో రవితేజ హీరోగా బాబీ తీసిన పవర్ మూవీ మాదిరిగా ఈ మూవీ కూడా కొంత అదేవిధమైనా పంథాలో సాగనుందట. అలానే ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా బాబి ఈ మూవీ కథని ఎంతో అద్భుతంగా రాసుకున్నారని చెబుతున్నారు. మరి ఇదే కనుక నిజమైతే అది త్వరలో మెగాస్టార్, బాబీ కాంబినేషన్లో ఒక పవర్ఫుల్ హిట్ మూవీ లభించినట్లే.....!!