ప్చ్... మేజర్ టీజర్ మళ్ళీ వాయిదా...?
వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరో అడవి శేషు తాజా చిత్రం మేజర్. వీర మరణం పొందిన ఎన్ ఎస్ జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు ) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లో మరింత డిఫరెంట్ గా కనిపించ బోతున్నారు అడవి శేషు. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీ స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ రిలీజ్ కానుంది. గూఢచారి’ తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అయినందున ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
జూలై 2న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ టీజర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బందం వెల్లడించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన టీజర్ రిలీజ్ వేడుకను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని స్వయంగా అడవి శేష్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేషనల్ మూవీ కోసం గ్రాండ్ గా నేషనల్ ఈవెంట్ జరిపి సందడి చేయాలనుకుంటున్నామని అయితే అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి వాయిదా వేయవలసి వచ్చిందని.. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అప్ డేట్ ను తెలియజేస్తానని తెలిపారు.
అంతేకాదు 'ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్య.. బుల్లెట్.....' అని పేర్కొని మిగిలింది మీకు అర్థమై ఉంటుంది కదా అంటూ 'పోకిరి' సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ ను కోట్ చేసాడు. దీని ద్వారా టీజర్ కాస్త లేట్ అయినప్పటికీ.. లేటెస్ట్ గా విడుదల చేస్తామంటూ అడవి శేషు చెప్పకనే చెప్పారు. ఈ సినిమాకు హీరో మహేశ్‌బాబు నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. సోనీ పిక్చర్స్ సమర్పణలో మహేష్ బాబు(జీఎంబీ ఎంటర్టైన్మెంట్) మరియు ఏఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలో విడుదలకానున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.